Manchu Vishnu: మా నాన్న చేసిన తప్పు అదే..
ABN , Publish Date - Dec 11 , 2024 | 12:44 PM
మమ్మల్ని ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పు అని మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఇంటిలో జరుగుతున్న అంశాలపై మంచు విష్ణు మాట్లాడుతూ..
ఉద్దేశపూర్వకంగా ఎవరిపై దాడి చేయలేదు. జర్నలిస్ట్‌పై దాడిని ఖండిస్తున్నాను. మా నాన్న తప్పు చేసి ఉంటే క్షమించాలి. ఆయన మీడియాతో చాలా గౌరవంగా ఉంటారు. తరాలుగా మా నాన్న అంటే ఏంటో అందరికీ తెలుసు. సమాజంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు. ఉమ్మడి కుటుంబంలో కొన్ని గొడవలు వచ్చాయి.
ఇవాళ ఉదయం పోలీసులు నాకు నోటీసులు ఇచ్చారు. పోలీసు విచారణకు వెళ్లాల్సిన అవసరం నాకు లేదు. వ్యవస్థపై గౌరవం ఉంది కాబట్టి సీపీని కలుస్తా.
గేట్లు పగలకొట్టి మనోజ్ ఇంట్లోకి వచ్చాడు. గొడవలతో మా అమ్మ ఆస్పత్రి పాలైంది. ఓ తండ్రిగా మనోజ్‌పై నాన్న తక్కువగానే రియాక్ట్ అయ్యారు.
‘‘ఇలా మాట్లాడాల్సి వస్తుంది.. ఇలాంటి సిట్యువేషన్ మాకు వస్తుందని ఊహించలేదు. మూడు తరాలుగా నాన్నగారు ఏంటి అనేది మీకు తెలుసు. ప్రతి ఇంట్లోనూ ఇష్యూస్ ఉంటాయి. అవి రిజాల్వ్ అవుతాయని పెద్దలు కోరుకుంటారు. నేను ఎమోషనల్ పెయిన్ ఫుల్‌గా ఉన్నాను. మా నాన్న చేసిన తప్పు మమ్మల్ని విపరీతంగా ప్రేమించటం. మీడియా వారు.. మీకు కుటుంబాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇష్యూస్ ఉంటాయి. కానీ కొందరు మా విషయంలో లిమిట్స్ క్రాస్ చేశారు. మా అమ్మ బాధలో ఉంది. నాన్నకు దెబ్బలు తగిలాయి..’’ అని చెప్పుకొచ్చారు.