Manchu Vishnu: మంచు విష్ణు కోసం హాలీవుడ్ లెజండరీ యాక్టర్..

ABN , Publish Date - Dec 14 , 2024 | 03:41 PM

మంచు విష్ణు హాలీవుడ్ లెజండరీ యాక్టర్ కొలాబరేట్ కానున్నారు..

మంచు విష్ణు.. కేవలం నటుడిగానే కాకుండా పారిశ్రామిక వేత్త, నిర్మాత, విద్యాసంస్థల నిర్వహకుడిగా రాణిస్తున్నారు. ఇటీవల 'కన్నప్ప' ప్రాజెక్ట్ కోసం అమెరికా వెళ్లిన ఆయన హాలీవుడ్ లో మెగా డీల్ కుదిరించుకున్నారు. అది కూడా హాలీవుడ్ లో ఏకచక్రాధిపత్యం వహించిన టాప్ నటుడితో. ఇంతకీ ఆ టాప్ యాక్టర్ ఎవరు? ఆ డీల్ ఏంటంటే..


ప్రస్తుతం విష్ణు తరంగా వెంచర్స్ పేరుతో మీడియా, ఎంటర్టైన్మెంట్ టెక్నాలజీ రంగంలో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు. ఇది పాన్ వరల్డ్ బిజినెస్ గా విస్తరించేందుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ వెంచర్ లో హాలీవుడ్ యాక్టర్ విల్ స్మిత్ భాగస్వామి కానున్నారు. దాదాపు 50 మిలియన్ల డాలర్ల నిధులతో ఈ వెంచర్ ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, యానిమేషన్, గేమింగ్, బ్లాక్‌ చెయిన్, ఏఆర్, వీఆర్, ఏఐ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో పెట్టుబడి పెట్టబోతున్నారు. భారత్ తో పాటు అమెరికాలోను ఈ వెంచర్ రిజిస్ట్రేషన్ పూర్తయింది. స్ట్రాటజిక్ మెంటార్షిప్, స్టార్టప్‌ ఇన్వెస్ట్మెంట్‌తో పాటు పలు సేవలు అందించనున్నారు.


తరంగ వెంచర్స్‌లో భాగస్వాములు వీరే

1. విష్ణు మంచు - నటుడు, నిర్మాత, వ్యవస్థాపకుడు

2. అద్దిశ్రీ - ఆర్థిక నిపుణుడు

3. ప్రద్యుమాన్ ఝలా - కెనడియన్ బిజినెస్ మాన్

4. వినయ్ మహేశ్వరి - మీడియా నిపుణుడు

5. విల్ స్మిత్ - హాలీవుడ్ లెజెండరీ యాక్టర్.

6. దేవేష్ చావ్లా, సతీష్ కటారియా - ఇన్వెస్ట్ అండ్ ఫండ్ ఆపరేషన్ ఎక్స్పర్ట్స్


Also Read-
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటికి క్యూ కడుతోన్న సినీ ప్రముఖులు

Also Read-Allu Arjun Released: అల్లు అర్జున్ విడుదల.. వెంటనే ఇంటికి వెళ్లలేదు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 14 , 2024 | 03:41 PM