వారందరి పేర్లు నేనే బయటపెడతా: మంచు విష్ణు
ABN , Publish Date - Dec 11 , 2024 | 02:16 PM
మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది. మా కుటుంబంలో బయటి వ్యక్తులు ఇన్‌వాల్వ్‌మెంట్ ఉంటే వారికి ఈవెనింగ్ వరకు సమయం ఇస్తున్నాము. లేదంటే అందరి పేర్లు నేనే బయడపెడతానని అన్నారు మంచు విష్ణు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
మంచు కుటుంబంలో వివాదం అనేక మలుపులు తిరుగుతుంది. మనోజ్, మోహన్ బాబు, విష్ణు పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఇంతకు ముందే మీడియాతో మాట్లాడిన మనోజ్ సంచలన విషయాలు చెప్పారు. ఇవాళ సాయంత్రం మరికొన్ని కీలక వివరాలు ప్రకటిస్తానని అనౌన్స్ చేశారు. తాజాగా విష్ణు కూడా మీడియా ముందుకు వచ్చారు. సంచలన కామెంట్స్ చేశారు. మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.
Also Read- Manchu Vishnu: అమ్మ బాధలో ఉంది.. లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు
ఆయన మాట్లాడుతూ.. ఇది మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది. మా కుటుంబంలో బయటి వ్యక్తులు ఇన్‌వాల్వ్‌మెంట్ ఉంటే వారికి ఈవెనింగ్ వరకు సమయం ఇస్తున్నాము. లేదంటే అందరి పేర్లు నేనే బయటపెడతాను. మా నాన్న చెప్పిందే వేద వాక్కు. ఆయన చెప్పిందే నేను చేస్తాను. కానీ నా తమ్ముడిపై నేనెప్పుడూ దాడులు చేయను. నా సినిమా, మా అసోసియేషన్ గురించి తప్ప నేను ఏ విషయంలో మాట్లాడను. కానీ నాకు కనుక అవకాశం ఉంటే ఫిర్యాదులు, వాయిస్ మెసేజ్ కూడా బయటికి వచ్చేది కాదు. సమయమే అన్ని ప్రాబ్లమ్స్‌ను సమాధానం ఇస్తుంది. అమెరికా నుంచి ఇక్కడికి వచ్చే క్రమంలో నరకం చూశాను.. మీ అమ్మగారు మీకు ఫోన్ చేసి ఏడుస్తుంటే దాన్ని మించిన బాధ ఇంకేమి ఉంటుంది.
తాను వచ్చేవరకు ఆగలేరా.. ఒక్క రాత్రి అంత హడావుడి చేయాల్సిన అవసరం ఏముందంటూ తండ్రి మోహన్ బాబును కోప్పడ్డానని మంచు విష్ణు మీడియాకు తెలిపారు. ప్రతి కుటుంబంలో చిన్న చిన్న గొడవలు జరుగుతాయని.. అలాగే తమ ఇంట్లో కూడా గొడవ జరిగిందని, పరిష్కరించుకుంటామని విష్ణు తెలిపారు. మీ అందరికిది బిగ్ బాస్ షోలా ఉందని మీడియాను ఉద్దేశించి ఆయన అన్నారు. ‘ఈ వివాదానికి కారణం మీరేనని’ మనోజ్ అంటున్నారని మీడియా విష్ణును ప్రశ్నించగా.. దానికి తాను సమాధానం చెప్పలేనని ‘ఐ డోంట్ నో’ అంటూ సమాధానం ఇచ్చారు.