Mohan Babu: సినీ పరిశ్రమకు సీఎం విధించిన షరతులపై మోహన్ బాబు రియాక్షన్ ఇదే..
ABN , Publish Date - Jul 02 , 2024 | 09:53 PM
టికెట్ రేట్లు పెంచుకునేందుకు సర్కార్ దగ్గరికి వచ్చే సినిమా ప్రొడ్యూసర్స్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కొన్ని షరతులు విధించిన విషయం తెలిసిందే. ఇకపై ప్రతి సినిమాకు ముందు సైబర్ క్రైమ్, డ్రగ్స్‌పై అవగాహన కల్పించేలా వీడియోలు చేయాలనే సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన షరతుపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్ దగ్గరికి వచ్చే సినిమా ప్రొడ్యూసర్స్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కొన్ని షరతులు విధించిన విషయం తెలిసిందే. ఇకపై ప్రతి సినిమాకు ముందు సైబర్ క్రైమ్, డ్రగ్స్‌పై అవగాహన కల్పించేలా వీడియోలు చేయాలనే సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన షరతులపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Manchu Mohan Babu) ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన ఏమన్నారంటే..
Also Read-Reventh Reddy - TFI: అలా చేయకపోతే ఎలాంటి సహకారం ఉండదు!
‘‘అందరికీ నమస్కారం... ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డిగారు ఈ డ్రగ్స్ మహమ్మారికి యువత బలి అవుతున్న విషయం గురించి మాట్లాడుతూ, చలనచిత్ర నటీనటులను 1, 2 నిమిషాల నిడివిలో వీడియో చేసి, ప్రభుత్వానికి పంపమన్నారు. ఇంతకుముందే ఇటువంటి వీడియోలు నేను కొన్ని చేసి వున్నాను. అయినా ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు నేను సందేశాత్మకమైన కొన్ని వీడియోలు చేసి ఉడతా భక్తిగా సమాజానికి సేవ చేసుకుంటానని తెలియజేస్తున్నాను..’’ అని మంచు మోహన్ బాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ‘గుడ్ జాబ్’ అంటూ నెటిజన్లు ఈ ట్వీట్‌కు కామెంట్స్ చేస్తున్నారు. (Mohan Babu Tweet on CM Revanth Condition)
అసలు సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
‘‘సినిమా టికెట్ రేట్లు పెంచాలని ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారు, కానీ సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం ప్రయత్నం చేయడంలేదు. అది సినిమా మాధ్యమానికి ఉన్న కనీస బాధ్యత. ఇకపై డ్రగ్స్, సైబర్ నేరాలపై సినిమాకు ముందుగానీ, తరువాత గానీ 3 నిమిషాల వీడియోతో అవగాహన కల్పించాలి. చిరంజీవి (Megastar Chiranjeevi) గారిలా డ్రగ్స్ పై అవగాహన కల్పించాల్సిందే. అలా కల్పించకపోతే వారి సినిమాలకు టికెట్ రేటు పెంచే ప్రసక్తి లేదు. ఈ షరతులను పట్టించుకోని దర్శనిర్మాతలకు, నటీనటులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ, సహకారాలు ఉండవు. సినిమా థియేటర్ యాజమాన్యాలు కూడా ఇందుకు సహకరించాలి’’ అని ఆయన కోరారు.