Manchu Manoj: బన్నీపై మంచు మనోజ్‌కి ఎంత ప్రేమో
ABN , Publish Date - Dec 14 , 2024 | 09:45 PM
బన్నీ రిలీజ్‌పై మంచు మనోజ్ స్పందించారు.. ఆయన చాలా ఉత్సహంగా ట్వీట్ చేశారు..
అల్లు అర్జున్ విడుదలపై తారాలోకం అంతా హర్షం వ్యక్తం చేస్తుంది. ఒకవైపు మంచు ఫ్యామిలీ వివాదం, మరోవైపు అల్లు అర్జున్ అరెస్ట్ తెలుగు సినీ ప్రపంచంలో తీవ్ర అలజడులు సృష్టించాయి. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ చేసిన ట్వీట్ హైలెట్ గా నిలుస్తోంది. బన్నీ రిలీజ్ పై మనోజ్ ఏమన్నారంటే..
మంచు మనోజ్ ట్వీట్ చేస్తూ.. "మొత్తం దిష్టి అంతా పోయింది బాబాయ్.. వెల్కమ్ బ్యాక్ అల్లు అర్జున్ గారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో మీరు కనబరిచిన ప్రశాంతత, బాధ్యతయుత వ్యవహారశైలిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా. బాధిత కుటుంబానికి మద్దతుగా నిలుస్తానని మీరు ఇచ్చిన హామీ మీ నిజమైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తోంది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన నిజంగా హృదయ విదారకం. భద్రతకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి? పక్కవారి పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. మీ కుటుంబానికి మరింత శాంతి, సంతోషాలు కలగాలని కోరుకుంటున్న" అంటూ రాసుకొచ్చారు. దీంతో వీళ్లిద్దరి బంధంపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు కుటుంబ గొడవలతో సతమతమవుతున్న తరుణంలోనే మనోజ్ మూవీ షూటింగ్‌లో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. ‘భైరవం’ అనే సినిమా చిత్రీకరణకు ఆయన హాజరయ్యారని సమాచారం. ఇందులో మనోజ్‌తో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. దివ్య పిళ్లై, ఆనంది, అదితి శంకర్ హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. ఈ ఫిల్మ్‌కు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు.