Manchu Manoj: బాంబ్ పేల్చిన మనోజ్.. జర్నలిస్ట్‌పై దాడి

ABN , Publish Date - Dec 14 , 2024 | 02:30 PM

సామరస్యంగా ముగిసిపోతుంది అనుకున్న మంచు వివాదంలో మరో ట్విస్ట్ ఏర్పడింది. తాజాగా మంచు మనోజ్ మరో బాంబ్ పేల్చారు.

మంచు ఫ్యామిలీ కాంట్రవర్సీ రోజుకో కొత్త టర్న్ తీసుకుంటోంది. ఒక మీడియా సంస్థ జర్నలిస్ట్‌పై మోహన్‌ బాబు దాడి చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనలో ఆ జర్నలిస్ట్ తీవ్రంగా గాయపడటంతో మోహన్ బాబు సారీ చెప్పాలంటూ జర్నలిస్ట్ సంఘాలు ధర్నాకు దిగాయి. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు. తాజాగా ఈ కాంట్రవర్సీ మీద మంచు మనోజ్ రియాక్ట్ అయ్యారు. తానే తీసుకెళ్లానంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


జర్నలిస్ట్‌పై దాడి ఘటనలో మీడియా తప్పేమీ లేదన్నారు మంచు మనోజ్. తానే వారిని లోపలకు తీసుకెళ్లానని స్పష్టం చేశారు. ‘ఈ ఘటనలో మీడియా తప్పేమీ లేదు. నిస్సహాయ స్థితిలో నేనే జర్నలిస్టులను లోపలకు తీసుకొని వెళ్లా. మా ఇంట్లోకి నన్ను రానివ్వకపోవడంతోనే మీడియా ప్రతినిధులను వెంటబెట్టుకొని వెళ్లా. లోపలికి వెళ్లిన తర్వాత జర్నలిస్ట్ మీద దాడి జరిగింది. ఇందులో మీడియా తప్పు లేదు’ అని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు.


ఒకవైపు కుటుంబ గొడవలతో సతమతమవుతున్న తరుణంలోనే మనోజ్ మూవీ షూటింగ్‌లో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. ‘భైరవం’ అనే సినిమా చిత్రీకరణకు ఆయన హాజరయ్యారని సమాచారం. ఇందులో మనోజ్‌తో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. దివ్య పిళ్లై, ఆనంది, అదితి శంకర్ హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. ఈ ఫిల్మ్‌కు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read-Allu Arjun Released: అల్లు అర్జున్ విడుదల.. వెంటనే ఇంటికి వెళ్లలేదు

Also Read-రేలంగి వివాహ ఆహ్వాన పత్రిక: 91 సంవత్సరాల క్రితపు శుభలేఖను చూశారా..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 14 , 2024 | 02:30 PM