Manchu Manoj: నా పోరాటం ఆస్తి కోసం కాదు..
ABN , Publish Date - Dec 10 , 2024 | 01:34 PM
తాను ఆస్తి కోసమో, డబ్బు కోసమో పోరాటం చేయడం లేదని సినీనటుడు మంచు మనోజ్ (manchu Manoj) అన్నారు. తనను తొక్కేయడానికి భార్య, పిల్లల అంశాన్ని తీసుకొస్తున్నారని ఆరోపించారు.
తాను ఆస్తి కోసమో, డబ్బు కోసమో పోరాటం చేయడం లేదని సినీనటుడు మంచు మనోజ్ (manchu Manoj) అన్నారు. తనను తొక్కేయడానికి భార్య, పిల్లల అంశాన్ని తీసుకొస్తున్నారని ఆరోపించారు. కుటుంబ వివాదం నేపథ్యంలో జల్‌పల్లిలో మనోజ్ మీడియాతో మాట్లాడారు. ‘‘నేను చేసేది ఆత్మగౌరవ పోరాటం. ఇది నా భార్య పిల్లల రక్షణకు సంబంధించిన విషయం. నన్ను అణగదొక్కేందుకు నా భార్యను బెదిరింపులకు గురి చేయడం.. నా ఏడు నెలల పాపను దీనిలోకి లాగడం.. నా పిల్లలు ఇంట్లో ఉండగానే ఇలా ప్రవర్తించడం సరికాదు. పోలీసుల వద్దకు వెళ్లి రక్షణ కోరాను. నాకు అన్ని విధాలా రక్షణ కల్పిస్తామని వారు నా మనుషులను బెదరగొట్టి వేరే వాళ్లని లోపలికి పంపించారు. నా మనుషులను ఇక్కడి నుంచి పంపించే అధికారం పోలీసు?కు ఎక్కడిది. ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఏకపక్షంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? నాకు మద్దతు కోసం ప్రపంచంలోని అందర్నీ కలుస్తా’’ అని మనోజ్ వ్యాఖ్యానించారు. (manchu Family war).
మంచు మోహన్‌బాబు కుటుంబంలో జరుగుతోన్న వివాదం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. మోహన్‌బాబు, మనోజ్ పరస్పర ఆరోపణలు చేసుకుంటూ లేఖలు విడుదల చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని, తనకు, తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీషరీఫ్ పోలీస్ ేస్టషన్‌లో మంచు మనోజ్ సోమవారం ఫిర్యాదు చేశారు. మరోవైపు మనోజ్‌తో తనకు ప్రాణహాని ఉందని మోహన్‌బాబు లేఖ ద్వారా రాచకొండ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో మంచు మనోజ్, ఆయన భార్యపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో జల్‌పల్లిలోని నివాసంలో సన్నిహితుల సమక్షంలో మోహన్‌బాబు, విష్ణు, మనోజ్ మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. (Manchu mohan babu)
మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై మంచు మనోజ్ సోమవారం రాత్రి ఎక్స్ వేదికగా సుదీర్ఘ వివరణ ఇచ్చారు తనకు న్యాయం చేయాని కోరుతూ రెండు తెలుగు రాష్ట్రల ముఖ్యమంత్రులను, ఉపముఖ్యమంత్రులను, తెలంగాణ డీజీపీని మనోజ్ తన పోస్ట్‌కు ట్యాగ్ చేశారు. ఈ విషయంలో చివరకు న్యాయమే గెలుస్తుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.