AadiParvam: ఈనెల 31న.. థియేట‌ర్ల‌లోకి మంచు లక్ష్మి ‘ఆదిపర్వం’

ABN , Publish Date - Oct 07 , 2024 | 07:35 PM

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో రూపొందిన‌ చిత్రం ‘ఆదిపర్వం’. ఆదిత్యం ఓం కీలక పాత్ర పోషించారు. ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తాజాగా మంచు లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా చిత్రంలో ఆమె క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

Manchu Lakshmi

మంచు లక్ష్మి (Manchu Lakshmi) ప్రధాన పాత్రలో రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ పతాకంపై ఏఐ ఎంటర్ టైన్ మెంట్స్ కలయికలో నిర్మించిన చిత్రం ‘ఆదిపర్వం’ (Aadiparvam). ఆదిత్యం ఓం కీలక పాత్ర పోషించారు. ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న పీరియాడిక్ ప్రేమకథతో గ్రాఫిక్స్ ప్రధానంగా ఈ చిత్రాన్ని దర్శకుడు సంజీవ్ మేగోటి రూపొందించారు. ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. టాలెంటెడ్ యాక్ట్రెస్ మంచు లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా ‘ఆదిపర్వం’ చిత్రంలో ఆమె క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఆమె క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా ఉండి ఆకట్టుకుంటోంది. ఇప్పటిదాకా మంచు లక్ష్మి చేయని, ఓ సరికొత్త పాత్రలో ఆమె ప్రేక్షకులను అలరించబోతున్నారు.

Manchu Lakshmi

దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ..- ముందుగా మంచు లక్ష్మి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అన్వికా ఆర్ట్స్, ఏఐ ఎంటర్ టైన్ మెంట్స్ సహకారంతో నేను అనుకున్న స్థాయిలో ఒక గొప్ప చిత్రంగా ‘ఆదిపర్వం’ను మలిచానన్న సంతృప్తి మిగులుతోంది. మంచు లక్ష్మి, ఆదిత్యం ఓం, శివ కంఠమనినేని, ఎస్తేర్ పాత్రలకు జనం నీరాజనం పలుకుతారు. వాళ్ల పర్ ఫార్మెన్స్ మెమొరబుల్ గా ఉంటాయి. 1974-90 మధ్య కాలంలో జరిగిన యదార్థ ఘటనల సమాహారంగా ఈ సినిమాను రూపొందించాను. అమ్మోరు, అరుంధతి చిత్రాల తరహాలో దుష్టశక్తికి, దైవశక్తికి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా. ఇలాంటి మూవీ ఈ మధ్య కాలంలో రాలేదు. మా మూవీలో గ్రాఫిక్స్ హైలైట్ అవుతాయి. ఈ నెల 31న థియేటర్స్ లో మా ఆదిపర్వం సినిమాను చూడండి అన్నారు.

Manchu Lakshmi


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఘంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ చిత్రం రెట్రో ఫీల్ తో గుడ్ లవ్ స్టోరీగా మొదలై కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ గా మిమ్మల్ని చూపు తిప్పుకోకుండా ఆకట్టుకుంటుంది. ఆదిపర్వం సినిమాకు మీ సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నామ‌న్నారు. సహ నిర్మాత గోరెంట శ్రావణి మాట్లాడుతూ.. ఆదిపర్వం తెలుగు చిత్రాల్లో ఒక గొప్ప ప్రయత్నంగా ప్రశంసలు దక్కించుకుంటుందని ఆశిస్తున్నాం. మూవీ టీమ్ ఎంతో సపోర్ట్ చేశారు. మీ అందరికీ గుర్తుండే ఒక మంచి సినిమాగా ఆదిపర్వం ఉంటుంది. ఫైట్స్, గ్రాఫిక్స్ కు మీ ప్రశంసలు దక్కుతాయన్నారు.

Manchu Lakshmi

Updated Date - Oct 07 , 2024 | 08:15 PM