Manchu Lakshmi: లైంగిక వేధింపులు.. హేమ కమిటీ నివేదిక.. మంచు లక్ష్మీ ఏమన్నారంటే!
ABN , Publish Date - Aug 22 , 2024 | 01:18 PM
మలయాళ చలన చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ (Hema Committee report) నివేదికలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. ప్రస్తుతం అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
మలయాళ చలన చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ (Hema Committee report) నివేదికలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. ప్రస్తుతం అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఈ కమిటీని ఉద్దేశించి నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi Prasanna) స్పందించారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ "ఈ సమాజంలో మహిళలకు సరైన చోటు లేదు. ఇప్పటికైనా మార్పు రావాలని కోరుకుంటున్నా. హేమ కమిటీ రిపోర్ట్ గురించి నాకు పూర్తిగా తెలియదు. సమాజంలో మహిళలకు సమానత్వం ఉండాలి. అన్యాయం జరిగిన వెంటనే బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది’’ అన్నారు. ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి మాట్లాడుతూ ‘‘నువ్వు ఎవరితోనూ చెప్పలేవని, అంత ధైర్యం నీకు లేదని భావించిన కొంతమంది వ్యక్తులు నిన్ను ఇబ్బందులకు గురి చేయడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వారికి నో చెప్పడం నేర్చుకోవాలి. కెరీర్ మొదలు పెట్టిన సమయంలో నన్నూ కొంతమంది ఇబ్బందిపెట్టారు. వారితో నేను చాలా దురుసుగా ప్రవర్తించేదాన్ని. ఆవిధంగా నా ఉద్యోగాన్ని పోగొట్టుకున్నా’’ అని మంచు లక్ష్మి అన్నారు.
మలయాళ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వర్కింగ్ కండిషన్లు, రెమ్యూనరేషన్, సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం తదితర అంశాలపై కమిటీ అధ్యయనం చేసింది. కాస్టింగ్ కౌచ్ మొదలు వివక్ష వరకు మాలీవుడ్‌లో మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. హేమ కమిటీ రూపొందించిన నివేదిక ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీంతో పలు సినీ రంగాలనుంచి తారలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కోలీవుడ్‌లోనూ కాస్టింగ్ కౌచ్ ఉందని యువ నటి సనమ్ శెట్టి (Sanam shetty) ఓ వీడియో ద్వారా తెలిపారు. వేధింపులకు పాల్పడే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నివేదికలు విడుదల చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని బాలీవుడ్ నటి తనూశ్రీ దత్తా ప్రశ్నించారు. గతంలో ఈమె కూడా క్యాస్టింగ్ కౌచ్ విషయంలో గొంతెత్తారు.