Manchu Lakshmi - Rave party : నేను మీ బిడ్డను.. ముక్కుసూటిగానే ఉంటా!
ABN , Publish Date - May 25 , 2024 | 12:14 PM
తాజాగా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ, కేసు గురించి మంచు లక్ష్మీ మాట్లాడారు. ‘యక్షిణి’ వెబ్‌సిరీస్ ట్రైలర్ ఆవిష్కరణలో ఓ విలేకరి ఆమె ముందు ఈ ప్రశ్న ఉంచగా సమాధానమిచ్చారు లక్ష్మీప్రసన్న.
తాజాగా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ(Rave party), కేసు గురించి మంచు లక్ష్మీ (Manchu lakshmi) మాట్లాడారు. ‘యక్షిణి’ (Yakshini) వెబ్‌సిరీస్ ట్రైలర్ ఆవిష్కరణలో ఓ విలేకరి ఆమె ముందు ఈ ప్రశ్న ఉంచగా సమాధానమిచ్చారు లక్ష్మీప్రసన్న. "రేవ్ పార్టీలో ఏం జరిగిందో తెలియదు. ఈ ప్రశ్న అడగడానికి ఇది సందర్భం కాదు. చాలా రోజుల తర్వాత నేను నటించిన వెబ్ సిరీస్ మీ ముందుకు రానుంది. దాని గురించి మాట్లాడుకుందాం. ఎవరో ఎక్కడికో వెళ్తే నాకేంటి సంబంధం. ఆ వ్యక్తులు వాళ్ల ప్రాబ్లమ్ అంతే’’ అని అన్నారు. మంచు లక్ష్మి, అజయ్, వేదిక, ప్రధాన పాత్రల్లో రూపొందిన తేజ మార్ని దర్శకత్వం వహించారు. జూన్ 14 నుంచి ‘డిస్నీ+ హాట్‌స్ట్టార్’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ మాట్లాడుతూ "నేను బాలీవుడ్‌కు వెళ్లానని కొందరు భావిస్తున్నారు. ముంబయి షిఫ్ట్ అయ్యానంతే. నాకు ఏ భాష అయినా ఒకటే. నేను మొదట హాలీవుడ్‌లో నటిగా పరిచయమయ్యాను. ఇప్పుడు టాలీవుడ్‌లో చేస్తున్నాను. కోలీవుడ్‌లో కూడా నటించాను. నటీనటులకు లాంగ్వేజ్ అడ్డుకాదు. హైదరాబాద్ నా ఇల్లుతో సమానం. నా కుటుంబమంతా ఇక్కడే ఉంటుంది. నా కెరీర్ కోసం, నా కూతురు భవిష్యత్తు కోసం ముంబయి వెళ్లానంతే. ఢిల్లీ వెళ్లాలనుకున్నా కానీ ముంబయి అయితే కెరీర్‌కు కూడా బాగుంటుందని షిఫ్ట్ అయ్యాను’’ అని చెప్పారు.
నేను ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని. మొదటి నుంచి ముక్కుసూటిగా మాట్లాడే తత్వం నాది. కొందరు నన్ను ట్రోల్స్ చేయడం చూసి బాధ కలిగేది. పొలిటికల్‌గా మాట్లాడడం మాకు రాదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాం. అది కొందరికి నచ్చుతుంది. మరికొందరికి నచ్చదు. నచ్చినవాళ్లు అభిమానిస్తారు. ఎవరో కావాలని నన్ను ట్రోల్ చేస్తారని భావించను. ఇండస్ర్టీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. రానా, చరణ్, తారక్.. మేమంతా కలిసి పెరిగాం. మేమంతా కలిసే ఉన్నాం.
మంచు విష్ణు ‘కన్నప్ప’లో నేను ఎందుకు నటించడం లేదని చాలా మంది అడుగుతున్నారు. బహుశా నాకు సరిపోయే పాత్ర అందులో లేదేమో. అందుకే నాకు అవకాశం ఇవ్వలేదు. మనోజ్ కూడా లేడు. ఒకవేళ నేను, మనోజ్ కూడా ఉంటే అది మా ఫ్యామిలీ సినిమా అవుతుంది.