Manchu Family: మంచు ఫ్యామిలీ వివాదం మళ్లీ మొదటికి.. పోలీస్ స్టేషన్‌కు మంచు మనోజ్
ABN , Publish Date - Dec 15 , 2024 | 07:03 PM
మంచు ఫ్యామిలీ వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. డిసెంబర్ 14 రాత్రి మంచు విష్ణు, మనోజ్‌ల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకు కారణం మంచు విష్ణునే అని ఆధారాలతో సహా విష్ణుపై ఫిర్యాదు చేసేందుకు మంచు మనోజ్ పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్‌కు వెళుతుండటంతో.. మరోసారి మంచు ఫ్యామిలీ వార్తలలో హైలెట్ అవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే..
మంచు ఫ్యామిలీ వివాదం మళ్లీ మొదటికి చేరుకుంది. రెండు రోజుల క్రితం మంచు ఫ్యామిలీలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలిసిందే. పోలీసులు రంగ ప్రవేశం చేసి మంచు హీరోలైన మోహన్ బాబు, విష్ణు, మనోజ్‌లకు నోటీసులు ఇచ్చి, విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. మళ్లీ పబ్లిక్ న్యూసెన్స్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలీసుల హెచ్చరికతో రెండు రోజుల పాటు సద్దుమణిగిన మంచు వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. తాజాగా మంచు మనోజ్ పహాడీషరీఫ్ పీఎస్ ఎదురు ధర్నాకు దిగుతున్నారు. అందుకు కారణం మంచు విష్ణు అని మనోజ్ చెబుతున్నారు. మంచు మనోజ్ ఏం చెప్పారంటే..
మంచు విష్ణు మరియు అతని అనుచరులపై ఫిర్యాదు చేయబోతున్నాను. నా కుటుంబాన్ని హత్య చేసేందుకు కుట్ర పన్నారు. జనరేటర్‌లో చక్కెర కలిపిన డీజిల్ పోశారు. దాంతో మా ఇంటికి వచ్చే విద్యుత్‌లో భయంకరమైన అంతరాయం నెలకొంది. ఇంట్లో అనారోగ్యంతో ఉన్న మా అమ్మ, తొమ్మిది నెలల పాప, బంధువులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. నేను, నాభార్య ఇంట్లో లేని సమయంలో ఇలా చేశారు. విష్ణుతో పాటు ఆయన అనుచరులు కలిసి కుట్ర పన్నారు. మా అమ్మ బర్త్‌డే అడ్డం పెట్టుకొని ఇంట్లోకి వచ్చారు. దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.
అసలు విషయం ఏమిటంటే.. మంచు మనోజ్ వాళ్ల అమ్మ పుట్టినరోజు సందర్భంగా.. రాత్రి తన స్నేహితులతో కలిసి జల్‌పల్లి నివాసంలో పార్టీ ఏర్పాటు చేశారు. పార్టీకి విద్యుత్ సరఫరా కోసం బయట నుండి జనరేటర్లను తెప్పించగా.. ఈ పార్టీ ఏర్పాటుతో మంచు విష్ణు అసహనానికి గురైయ్యారని, అందుకే జనరేటర్‌లోకి తన మనుషులతో పంచదార కలిసి డీజిల్ పోయించారట విష్ణు. ఈ విషయాన్ని మంచు మనోజ్ గమనించడంతో.. అన్నదమ్ముల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఆధారాలతో సహా పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో మంచు మనోజ్‌పై ఫిర్యాదు చేసేందుకు మనోజ్ సిద్ధమయ్యారు. ఇప్పటికే శాంతి భద్రతలకు విగాథం కలిగించవద్దంటూ ఇద్దరితో సీపీ బాండ్ రాయించుకున్న విషయం తెలిసిందే. మంచు మనోజ్ పోలీసు స్టేషన్‌కు వెళుతుండటంతో మరోసారి చర్చనీయాంశంగా మంచు ఫ్యామిలీ వివాదం మారింది.