Manchu Family Controversy: మంచు ఫ్యామిలీ కాంట్రవర్సీ.. నేర్చుకోవాల్సిందేంటి
ABN , Publish Date - Dec 11 , 2024 | 09:01 PM
మంచు, కొణిదెల, నందమూరి, అక్కినేని, దగ్గుబాటి, ఘట్టమనేని ఇలా ఇంటి పేరు ఏదైనా సగటు తెలుగు సినిమా అభిమానులు తెలుసుకోవాల్సింది ఏంటంటే..
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మంచు ఫ్యామిలీ కాంట్రవర్సీ హాట్ టాపిక్‌గా మారింది. ఏ ఇద్దరు కలిసిన ఇదే చర్చ. క్రమశిక్షణ, లెజండరీ అనే పేర్లతో ప్రచారం చేసుకున్నది కూడా వాళ్లే. ఇదంతా పక్కన పెడితే సగటు సినీ అభిమాని ఈ ఘటన ద్వారా నేర్చుకోవాల్సిందేంటి..
వాస్తవేమే, ప్రతీ ఇంట్లోనూ, కుటుంబంలోనూ లుకలుకలు ఉంటాయి. వారు కూడా సర్వసాధారణమైన మనుషులే. ఇప్పటికైనా ఏ కుటుంబమైనా, వ్యక్తి అయినా, వ్యవస్థ అయినా, నటుడైన, రాజకీయనాయకుడైన, ఎవరైనా ఆకాశం నుండి ఊడిపడినట్లు, కారణజన్ములైనట్లు, మార్గదర్శకులైనట్లు భావించడం మానేస్తే మంచిది. అది కేవలం మీ సృష్టే మీ ప్రేమ లేదా భావన మాత్రమే వారిని మీకు ఉన్నతులుగా కనిపించేలా చేస్తుంది. నిజానికి హేతుబద్దత చూస్తే ఏ వ్యక్తులు స్పెషల్‌గా కనిపించరు. కేవలం మీ భావన మాత్రమే వ్యక్తులను స్పెషల్‌గా కనిపించేలా చేస్తుంది. ఒకసారి మీరు ఆ ఫీలింగ్ కోల్పోతే ఎదుటి వారు సామాన్యులుగా కనిపిస్తారు. అవును కదా.. చలికాలం గడ్డ కట్టాల్సిన మంచు ముక్కలవడం కేవలం కలికాలం అంటూ నవ్వుతూ సాగాలి అంతే.
ఇది పక్కన పెడితే.. మోహన్ బాబు జర్నలిస్ట్‌ల పై దాడి చేయడం ఇది మొదటిసారి కాదు. తన మొదటి భార్య శ్రీ విద్య మరణం గురుంచి వార్త రాశారన్న కోపంతో ఓ సినిమా వారపత్రిక ఆఫీస్‌కి వెళ్లి రిపోర్టర్‌ను కొట్టడం ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది. మోహన్ బాబు మొదటి భార్య విద్యాదేవి కూతురు, కొడుకు మంచు లక్ష్మి, విష్ణు. విద్యాదేవి మరణాంతరం ఆయన విద్యా దేవి సోదరి నిర్మలాదేవిని పెళ్లాడారు. ఆమె తనయుడే మంచు మనోజ్.