Manchu Controversy: మంచు మనోజ్ మాట్లాడితే కేస్.. కోర్టు సంచలన నిర్ణయం

ABN , Publish Date - Dec 21 , 2024 | 12:59 PM

మంచు ఫ్యామిలీలో కొనసాగుతున్న వివాదాల నేపథ్యంలో సిటీ సివిల్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.

మంచు కుటుంబ వివాదంలో నటుడు మనోజ్ మంచుపై హైదరాబాదులోని సిటీ సివిల్ కోర్టు మధ్యంతర నిషేధ ఉత్తర్వులను మంజూరు చేసింది. యూట్యూబ్ లేదా మరే ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో విష్ణు మంచు గురించి ఎలాంటి పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేయకుండా మనోజ్ కు కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. మంచు కుటుంబంలో కొనసాగుతున్న కుటుంబ వివాదం నేపథ్యంలో మంచు మనోజ్ అవమానకరమైన వ్యాఖ్యలు చేయడంతో.. అది విష్ణు మంచుకు బాధ కలిగించిందని, అలాగే ఆయన ప్రతిష్టకు హాని కలిగేలా ఉన్నాయని, విష్ణు పబ్లిక్ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా మాట్లాడారని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. విష్ణు సమర్పించిన సాక్ష్యాలను సమీక్షించిన అనంతరం అతని వ్యక్తిగత సమగ్రతను దృష్ట్యా విష్ణు మంచు ప్రతిష్టకు భంగం కలిగించే పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలను నిరోధించేలా తీర్పును ఇచ్చింది.


WhatsApp Image 2024-12-21 at 12.22.47.jpegWhatsApp Image 2024-12-21 at 12.23.01.jpeg


మరోవైపు మోహన్ బాబుకి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. హత్యాయత్నం కేసులో సోమవారం వరకు అరెస్ట్ చెయ్యొద్దని కోరుతూ బెయిల్ పిటిషన్ కోరారు మోహన్ బాబు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు. మోహన్ బాబు ఇక్కడే ఉన్నారనే విషయాన్ని అఫడవిట్ లో దాఖలు చేయాలని కోరింది. అప్పుడే ఏదైనా తేల్చుతాం అని తెలిపిన కోర్టు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

Updated Date - Dec 21 , 2024 | 01:13 PM