Vettaiyan: మడత పెట్ట వచ్చిండే.. మనసు పెట్టి వచ్చిండే! ‘వేట్టైయాన్’ నుంచి సాంగ్ రిలీజ్‌

ABN , Publish Date - Sep 09 , 2024 | 08:59 PM

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘వేట్టైయాన్’. తాజాగా ఈ మూవీ నుంచి ‘మనసిలాయో..’ మెరుపై వచ్చిండే.. మడత పెట్ట వచ్చిండే.. మనసు పెట్టి వచ్చిండే.. అంటూ ప‌క్కా మాస్ బీట్‌తో సాగే ఫస్ట్ సింగిల్ ని మేకర్స్ ఈ రోజు (సోమ‌వారం) విడుదల చేశారు.

rajini

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా భారీ బ‌డ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోన్న నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ (Lyca Productions)బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘వేట్టైయాన్’(Vettaiyan). బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు ‘2.0, ద‌ర్బార్‌, లాల్ స‌లామ్’ వంటి చిత్రాల త‌ర్వాత ర‌జినీకాంత్, లైకా ప్రొడ‌క్ష‌న్స్ క‌ల‌యిక‌లో రాబోతున్న నాలుగో సినిమా ‘వేట్టైయాన్’. తాజాగా ఈ మూవీ నుంచి ‘మనసిలాయో..’ మెరుపై వచ్చిండే.. మడత పెట్ట వచ్చిండే.. మనసు పెట్టి వచ్చిండే.. అంటూ ప‌క్కా మాస్ బీట్‌తో సాగే ఫస్ట్ సింగిల్ ని మేకర్స్ ఈ రోజు (సోమ‌వారం) విడుదల చేశారు.

GXCY2rUWkAAHL4D.jpeg

పేట‌, ద‌ర్బార్‌, జైల‌ర్ చిత్రాల‌కు పుట్ స్టాపింగ్ ట్యూన్ అందించి మెప్పించిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుద్ ర‌విచంద‌ర్ (Anirudh) నాలుగోసారి ర‌జినీకాంత్ (Rajinikanth) వేట్టైయాన్ సినిమాకు మ్యూజిక్ అందించారు. ‘మనసిలాయో..’ అంటూ సాగే ఈ పాట వింటుంటే ఎన‌ర్జిటిక్ బీట్‌తో సాగుతుంది. ర‌జినీకాంత్, మంజు వారియ‌ర్ మ‌ధ్య సెల‌బ్రేష‌న్‌లో వ‌చ్చే పాటగా చిత్రీక‌రించారు. ఈ పాఠ‌లో మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుద్ సైతం స్టెప్పులేస్తూ క‌నిపించ‌టం విశేషం.

GXCBklFaUAAxzQL.jpeg


సూప‌ర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఇమేజ్‌కు త‌గ్గ‌ట్టు ఆయ‌న అభిమానులు స‌హా అంద‌రినీ దృష్టిలో పెట్టుకుని అనిరుధ్ (Anirudh) మ‌రోసారి త‌న‌దైన పంథాలో బాణీల‌ను అందించిన‌ట్లు ‘మనసిలాయో..’ అనే పాట‌ను వింటుంటే తెలుస్తోంది. సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. శ్రీనివాస మౌళి రాసిన ఈ పాట‌ను న‌క‌ష్ అజీజ్‌, అరుణ్ కౌండిన్య‌, దీప్తి సురేష్ పాడారు. ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో విష‌య‌మేమంటే ఈ పాట త‌మిళ వెర్ష‌న్ కోసం లెజెండ్రీ ప్లే బ్యాక్ సింగ్ మ‌లేషియా వాసుదేవ‌న్ వాయిస్‌ను ఏఐలోక్రియేట్ చేసి ఇందులో ఉప‌యోగించటం విశేషం.

GXCDNn2aQAAKWIl.jpeg

ర‌జినీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో మంజు వారియ‌ర్‌, ఫ‌హాద్ ఫాజిల్, రానా ద‌గ్గుబాటి, రితికా సింగ్‌, దుష‌రా విజ‌య‌న్, రోహిణి, అభిరామి త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Vettaiyan - Manasilaayo Lyric Video From Today 5PM_Clean.jpg

ఆడియెన్స్‌కు స‌రికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వ‌టానికి సిద్ధ‌మ‌వుతోన్న ఈ సినిమాను పాన్ ఇండియాగా త‌మిళ‌, తెలుగు, హిందీ, క‌న్న‌డ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా అక్టోబ‌ర్ 10న భారీ ఎత్తున విడుద‌ల చేస్తున్నారు. తెలుగు రిలీజ్ హ‌క్కుల‌ను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి.

Updated Date - Sep 09 , 2024 | 08:59 PM