Manadesam@ 75: సీనియర్ ఎన్టీఆర్ 'మనదేశం' 75 ఏళ్ల వేడుక
ABN , Publish Date - Dec 06 , 2024 | 02:16 PM
సీనియర్ ఎన్టీఆర్ (Sr Ntr) నటించిన తొలి చిత్రం ‘మన దేశం’ (Manadesam). ఈ సినిమా విడుదలై 75 ఏళ్లు (75 Years Celebrations) పూర్తయిన విషయం తెలిసిందే.
సీనియర్ ఎన్టీఆర్ (Sr Ntr) నటించిన తొలి చిత్రం ‘మన దేశం’ (Manadesam). ఈ సినిమా విడుదలై 75 ఏళ్లు (75 Years Celebrations) పూర్తయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయవాడలో వేడుకను నిర్వహించాలని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (TFI) నిర్ణయించింది. డిసెంబర్ 14న విజయవాడలో ఈ వేడుక జరగనుంది. దీని ఏర్పాట్ల కోసం బుధవారం ఛాంబర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు నిర్మాతల మండలి, తెలంగాణ ేస్టట్ చిత్ర వాణిజ్యమండలి, తెలుగు ఫిల్మ్ ఇండస్ర్టీ ఎంప్లాయిస్ ఫెడరేషన్, తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్, తెలుగు సినీ దర్శకుల సంఘం ప్రతినిధులు పాల్గొని వేడుక గురించి చర్చించారు.