Malvi Malhotra: బాలయ్య అభిమానిగా నటించడం ఆనందంగా ఉంది!

ABN , Publish Date - Aug 04 , 2024 | 05:13 PM

రాజ్‌ తరుణ్‌, మాల్వీ మల్హోత్ర జంటగా నటించిన చిత్రం ‘తిరగబడర సామీ’. ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

రాజ్‌ తరుణ్‌9Raj tarun), మాల్వీ మల్హోత్ర (malvi malhotra) జంటగా నటించిన చిత్రం ‘తిరగబడర సామీ’ (tiragabadara saami). ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో మన్నారా చోప్రా, మాల్వీ మల్హోత్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాల్వీ.. తనకు తెలుగు చిత్ర పరిశ్రమ అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. ‘‘ఈ చిత్రంతో నన్ను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసినందుకు నిర్మాత శివకుమార్‌కు ధన్యవాదాలు. తొలి చిత్రంలోనే ఇలాంటి మాస్‌ పాత్ర పోషించడం ఆనందంగా ఉంది. సినిమాలో హీరోయిన్‌ బాలయ్య అభిమానిగా కనిపించడం చాలా అరుదుగా ఉంటుంది. అలాంటి రోల్‌ నేను చేసినందుకు సంతోషంగా ఉంది. టీమ్‌లో అందరూ నాకెంతో సపోర్ట్‌ చేశారు. మరెన్నో తెలుగు చిత్రాల్లో యాక్ట్‌ చేయాలనుకుంటున్నా. అందుకు మీ ప్రేమాభిమానాలు కావాలి’’ అని మాల్వీ తెలిపారు.

మన్నారా చోప్రా మాట్లాడుతూ.. ‘‘బిగ్‌బాస్‌ ఓటీటీలో రన్నరప్‌గా నిలిచా. నన్ను ఆదరించిన వారందరికీ ధన్యవాదాలు. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో యాక్ట్‌ చేయాలని ఎప్పటినుంచో ఉంది. అలా నటించినందుకు ఆనందంగా ఉంది’’ అని అన్నారు.


తమ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారని.. థియేటర్ల సంఖ్య కూడా పెంచామని దర్శకుడు అన్నారు. ఒక సినిమాపై ఎంతోమంది కుటుంబాలు ఆధారపడి ఉంటాయని.. రివ్యూలు రాసేవారు కాస్త జాగ్రత్తగా ఆలోచించి రాయాలని సూచించారు.

Updated Date - Aug 04 , 2024 | 05:13 PM