Malavika Mohanan: త్వరలో 'రాజాసాబ్‌'తో వస్తా!

ABN , Publish Date - Aug 17 , 2024 | 06:16 PM

తమిళస్టార్‌ చియాన్  విక్రమ్‌ (Vikram) నటించిన ‘తంగలాన్‌’ (Thangalan) ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి చక్కని విజయం అందుకుంది. పా.రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాలో మాళవిక మోహనన్‌ (Malavika mohanan0 ఆరతి పాత్రలో నటించింది.

తమిళస్టార్‌ చియాన్  విక్రమ్‌ (Vikram) నటించిన ‘తంగలాన్‌’ (Thangalan) ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి చక్కని విజయం అందుకుంది. పా.రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాలో మాళవిక మోహనన్‌ (Malavika mohanan0 ఆరతి పాత్రలో నటించింది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. త్వరలోనే ‘రాజాసాబ్‌’తో తెలుగు ఆడియన్స్‌ను పలకరించనున్నట్లు చెప్పారు. ప్రభాస్‌ అందరికీ డార్లింగ్‌ అని.. కచ్చితంగా ఈ చిత్రం హిట్‌ అవుతుందని దీమా వ్యక్తం చేశారు.

Malavika.jpg

‘'తంగలాన్’లో విక్రమ్‌గారితో నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన గొప్ప నటుడు. ఈ సినిమా షూటింగ్‌ రోజులను ఎప్పటికీ మరచిపోలేను. ఇలాంటి విభిన్నమైన, బలమైన పాత్రలను తెరకెక్కించడం సాహసం. ఈ చిత్రం ఆగస్టు 30న బాలీవుడ్‌లో రిలీజ్‌ కానుంది. ఆరోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. దీన్ని గొప్పగా చిత్రీకరించడానికి టీమ్‌ ఎంతో కష్టపడింది. ఆ కష్టాన్ని హిందీ ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్మకముంది’ అని అన్నారు.


 

Updated Date - Aug 17 , 2024 | 06:16 PM