Mahesh Babu: అనంత్  అంబానీ పెళ్లికి.. ఎయిర్‌పోర్ట్‌ ఫొటోలు వైరల్‌!

ABN , Publish Date - Jul 12 , 2024 | 02:54 PM

ముకేశ్‌ అంబానీ ఇంట పెళ్లి సందడి ఓ రేంజ్‌లో జరుగుతోంది. ఆయన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ(Ananth Ambani), ఫార్మా దిగ్గజం వీరేన్‌ మర్చంట్‌ కుమార్తె రాధికా (Radhika merchant) మర్చెంట్‌ల వివాహం శుక్రవారం అత్యంత వైభవంగా జరగనుంది.

ముకేశ్‌ అంబానీ ఇంట పెళ్లి సందడి ఓ రేంజ్‌లో జరుగుతోంది. ఆయన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ(Ananth Ambani), ఫార్మా దిగ్గజం వీరేన్‌ మర్చంట్‌ కుమార్తె రాధికా (Radhika merchant) మర్చెంట్‌ల వివాహం శుక్రవారం అత్యంత వైభవంగా జరగనుంది. ముంబైలోని జియో వరల్డ్‌ సెంటర్‌లో ఈ వేడుకకు వేదికగా నిలిచింది. అనంత్‌-రాధికల పెళ్లి కోసం ఇప్పటికే వివిధ దేశాల నుంచి వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, సినీ నటులు అతిథులుగా హాజరవుతున్నారు. టాలీవుడ్‌ నుంచి రామ్‌చరణ్‌ (Ram charan)దంపతులు కూడా వివాహానికి బయలుదేరారు. శుక్రవారం ఉదయం మహేష్‌ బాబు కూడా ఈ వివాహానికి బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్టులో సతీమణి నమ్రత, కూతురు సితారతో కలిసి సూపర్‌ స్టార్‌ కనిపించారు. ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

Mahesh-600.jpg

మహేష్‌ (Mahesh) కొత్త లుక్‌ అందరినీ ఆశ్చర్యపరిచింది. పొడవైన జుట్టు, గడ్డంతో హాలీవుడ్‌ హీరోలా కనిపించారు ఇటీవల ఫ్యామిలీతో కలిసి లండన్‌, జర్మనీకి వెకేషన్‌కు వెళ్లిన మహేష్‌.. రెండు రోజుల క్రితమే ఇండియాకు తిరిగొచ్చారు. ఈ ఏడాది 'గుంటూరు కారం' చిత్రంతో అలరించిన ఆయన రాజమౌళి దర్శకత్వం వహించనున్న 'ఎస్‌ఎస్‌ఎంబీ29' సెట్‌లో త్వరలో అడుగుపెట్టనున్నారు. ఈ చిత్రంలో మహేశ్  భిన్నంగా కనిపిస్తారు. ఇప్పటికే పలు ఫొటో షూట్లు నిర్వహించారు జక్కన్న. మహేష్‌ కూడా కసరత్తులు మొదలుపెట్టారు. హీరో పేరు తప్ప మరో అప్‌డేట్‌ ఇవ్వని రాజమౌళి మహేశ్  పుట్టినరోజున ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ ఇవ్వనున్నారట. 

Updated Date - Jul 12 , 2024 | 03:07 PM