Mahesh Babu: న్యూ బిజినెస్‌లోకి మహేష్.. అభిమానుల కోసం

ABN , Publish Date - Dec 12 , 2024 | 02:47 PM

సూపర్ స్టార్ మహేష్.. 'మేము మేము బాగానే ఉంటాం, మీరే బాగుండాలి' అంటూ ఫ్యాన్స్‌ని మాబ్ మెంటాలిటీకి దూరం చేసిన వ్యక్తి. ఆయన మరోసారి అభిమానుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు.

మహేష్ బాబు.. కేవలం నటుడిగానే కాకుండా తన హృదయ దాతృత్వం, పర్సనాలిటీ, చరిష్మాతో అన్నింట్లోనూ నంబర్ 1 అంటూ నిరూపించుకుంటారు. ఇలాంటి మనిషిని బ్రాండ్స్ వదులుతాయా, అసలు వదలవు. సౌతిండియాలో ఆయన బ్రాండ్ వాల్యూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బడా కార్పొరేట్ కంపెనీలన్నీ బాబు వెనుకే. తాజాగా ఆయన ఓ సోలార్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ కంపెనీ యాడ్‌లో మహేష్ బాబు మెరిసిపోతున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.


అయితే మహేష్ బాబు కేవలం ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ మాత్రమే కాదు 50% స్టేక్ హోల్డర్ కూడా. భవిష్యత్తులో సోలార్ పవర్ కీలకంగా మారబోతున్న క్రమంలో మహేష్ ఈ బిజినెస్‌లోకి అడుగులు వేశారు.అయితే ఇందులో కేవలం తాను మాత్రమే కాకుండా.. తన అభిమానులను కూడా ఇన్‌వాల్వ్ నిర్ణయంతో ఈ బిజినెస్‌లో భాగస్వామి అయ్యారట. తన సోలార్ పవర్ డిస్ట్రిబ్యూషన్‌ను అభిమానులకు అందించడం ద్వారా ఆర్దికంగా వారిని ఎంకరేజ్ చేసినట్లుగా ఉంటుందని..‌ కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ ఫ్యాన్స్ కు ఇవ్వాలనేది మహేష్ బాబు నిర్ణయంగా తెలుస్తొంది.

babusolarcompany.jpg


నిజానికి అభిమానులంటే హీరోల కోసమే పని చేస్తారనే దృక్పథాన్ని మారుస్తూ.. వారిని ఆర్దికంగా ఎదిగేందుకు ఓ అవకాశాన్ని మహేష్ సృష్టించారు. ఇప్పటి వరకు ఏ హీరో కూడా ఫ్యాన్స్ కోసం ఈ తరహా నిర్ణయం తీసుకుంది లేదు. తన అభిమానుల శ్రేయస్సు కోరుతూ‌ మహేష్ చేసిన ఈ ఆలోచన‌ మంచిదే కాబట్టి మరింత మంది హీరోలు బాబును ఫాలో అవుతారెమో చూడాలి.

Updated Date - Dec 12 , 2024 | 02:47 PM