Mahesh Babu: కల్కిపై మహేష్‌ రివ్యూ... ఏం చెప్పారంటే!

ABN , Publish Date - Jul 09 , 2024 | 02:19 PM

ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ (Nag ashwin) దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మించిన 'కల్కి 2898ఎడీ’ చిత్రంవిడుదలైనప్పటి నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ (Nag ashwin) దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మించిన 'కల్కి 2898ఎడీ’ చిత్రంవిడుదలైనప్పటి నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు (Mahesh babu) సోషల్‌ మీడియా వేదికగా కల్కి టీమ్‌కు శుభాకాంక్షలు చెప్పారు. తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. ‘‘కల్కి ఓ అద్భుతం.. జస్ట్‌ వావ్‌. నాగ్‌ అశ్విన్‌ విజన్‌కు హ్యాట్సాఫ్‌. ప్రతి ఫ్రేమ్‌ కళాఖండంలా ఉంది. అమితాబ్‌ బచ్చన్‌ స్క్రీన్  ప్రజెన్స్‌కు ఎవరూ సరితూగరు. కమల్‌ హాసన్‌ ఏ పాత్రకైనా జీవం పోయగలరు. ప్రభాస్‌ ఒక  గొప్ప క్యారెక్టర్‌లో చాలా సులభంగా నటించారు. దీపిక ఎప్పటిలాగే అద్భుతంగా కనిపించారు. ఇంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న వైజయంతీ మూవీస్‌కు అభినందనలు’’ అని రాసుకొచ్చారు. మహేష్‌ ట్వీట్‌కు దర్శకుడు నాగ్‌ అశ్విన్  స్పందించారు. మహేశ్ కు  ధన్యవాదాలు తెలిపారు. ‘మీ అభినందనలు అందుకోవడం మా టీమ్‌కు ఆనందంగా ఉంది’ అని రిప్లై ఇచ్చారు. నిర్మాణసంస్థ కూడా మహేశ్‌కు థ్యాంక్స్‌ చెప్పింది.

kalki.jpg

సినిమా విడుదలై వారం దాటుతున్నా క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల్లో ఈ మూవీ రూ.900 కోట్లకు (గ్రాస్‌) పైగా వసూలు చేసినట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది.  దీంతో త్వరలోనే ఈ చిత్రం రూ.1000 కోట్లు సొంతం చేసుకోవడం ఖాయమని అభిమానులు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. అగ్ర నటులు అమితాబ్‌ బచ్చన్‌.. అశ్వత్థామగా, కమల్‌ హాసన్‌.. సుప్రీం యాస్కిన్‌గా ఆకట్టుకున్నారు. విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ అతిథి పాత్రలతో అలరించారు. బౌంటీ ఫైటర్‌ భైరవగా సందడి చేసిన ప్రభాస్‌ చివరిలో కర్ణుడిగా కనిపించి పార్ట్‌ 2పై మరిన్ని అంచనాలు పెంచేశారు. అమెరికాలో ప్రభంజనం సృష్టిస్తోన్న సందర్భంగా దర్శకుడు నాగ్‌ అశ్విన్  అక్కడి ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. అంతే కాదు అక్కడి ప్రేక్షకులతో కలిసి ఈ సినిమా వీక్షించనున్నారు. అమెరికాలోని బిగ్గెస్ట్‌ ఐమాక్స్‌లో శనివారం ఆయన ఆడియన్సతో ఆయన కల్కి చూడనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణసంస్థ పోస్టర్‌ విడుదల చేసింది.  

Updated Date - Jul 09 , 2024 | 02:37 PM