Guntur Kaaram: మహేష్ కాల్చిన ఆ బీడీ వెనక సంచలన కథ వుంది తెలుసా...

ABN , Publish Date - Jan 16 , 2024 | 02:26 PM

మహేష్ బాబు 'గుంటూరు కారం' లో బీడీ కాలుస్తూ కనపడుతూ వుంటారు. కానీ అతను నిజ జీవితంలో స్మోక్ చెయ్యరు, ప్రోత్సహించరు, మరీ ఇందులో ఎలా బీడీ కాలుస్తూ కనిపించారు. దాని వెనక ఒక సంచలన కథ వుంది తెలుసా...

Guntur Kaaram: మహేష్ కాల్చిన ఆ బీడీ వెనక సంచలన కథ వుంది తెలుసా...
Mahesh Babu from Guntur Kaaram

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' సంక్రాంతి పండగకి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు రమణ గాడి పాత్రలో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో రమణగాడు బీడీని వెలిగిస్తూ ఉంటాడు, కాలుస్తూ ఉంటాడు. కానీ మరి నిజ జీవితంలో మహేష్ బాబు స్మోక్ చెయ్యరు కదా, మరి ఇది ఎలా కాల్చారు. దీనికి వెనక ఒక సంచలనమైన కథ వుంది అని చెప్పుకొచ్చారు మహేష్. (Mahesh Babu reveals the story behind the beedi in Guntur Kaaram)

ఈ సినిమాలో రమణగాడు బీడీ కాలుస్తూ కనపడుతూ ఉంటాడు, ముందు ఒక రియల్ బీడీ ఇవ్వగానే, మహేష్ అది కాల్చారంట. అది కాల్చగానే మహేష్ కి వెంటనే తలనొప్పి (మైగ్రేరెన్) వచ్చేసింది అని చెప్పారు. "నేను స్మోక్ చెయ్యను, అలాగే ఎవరినీ ప్రోత్సహించను కూడా. ఇందులో బీడీ కాల్చగానే నాకు తలనొప్పి మొదలైంది, వెంటనే త్రివిక్రమ్ గారికి చెప్పాను, నా వల్ల కాదు అని. వెంటనే యూనిట్ లో ఒకరు ఒక బీడీ తెచ్చి ఇచ్చారు, అది ఆయుర్వేదిక్ బీడీ అని చెప్పారు. అందులో టొబాకో లేకుండా, లవంగ, ఇంకా కొన్ని ఆకులు వేసి చేసింది, మింట్ తిన్నట్టుగా ఉంటుంది, అదే వాడాము," అని చెప్పారు మహేష్ బాబు.

maheshbabugunturkaarampicis.jpg

'గుంటూరు కారం' సినిమాలో రమణ గాడి బీడీ వెనక ఇంత కథ వుంది అంటే నమ్మగలమా. నమ్మశక్యం కావటం లేదు కదా, కానీ ఇది నిజం. మహేష్ బాబు ఈ బీడీ గురించి ఇంటర్వ్యూ లో చెపుతుంటే, యాంకర్ సుమ కూడా ఆశ్చరైపోయి ఆ బీడీ బ్రాండ్ తో అమ్మితే బాగుంటుంది అని కూడా చెప్పారు. కథానాయిక శ్రీలీల కూడా ఈ ఇంటర్వ్యూ లో ఎన్నో సంగతులు చెప్పారు.

Updated Date - Jan 16 , 2024 | 02:26 PM