Mahesh Babu: సూటెడ్ అప్... సినిమా కోసమేనా?
ABN , Publish Date - Mar 08 , 2024 | 07:57 PM
సూపర్‌స్టార్ మహేష్ బాబు స్టన్నింగ్ లుక్‌లో దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఆయన రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సూపర్‌స్టార్ మహేష్ బాబు *Mahesh Babu) స్టన్నింగ్ లుక్‌లో దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఆయన రాజమౌళి 9Rajamouli) సినిమా కోసం రెడీ అవుతున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. రాజమౌళి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో మహేష్ మొత్తం ఎనిమిది గెటప్స్‌లో కనిపించనున్నారని టాక్. ఇదిలా ఉంటే.. తాజాగా మహేష్.. లేజర్ ఫోకస్ అని న్యూ లుక్ ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో క్లీన్ షేవ్, లాంగ్ హెయిర్‌తో కనిపించారు. (Mahesh Babu new look Viral)
ఇదిలా ఉండగా శుక్రవారం మహేష్ మరో ఫొటోను షేర్ చేసి సూటెట్ అప్ అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ న్యూ లుక్ 'ఎస్‌ఎస్‌ఎంబీ 29' కోసమా? లేక ఏదైనా యాడ్ షూట్ కోసమా అని చర్చ మొదలైంది.
అభిమానులు మాత్రం 'ఎస్‌ఎస్‌ఎంబీ 29' కోసమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జక్కన్న తెరకెక్కించే ఈ సినిమాలో మహేష్ పూర్తిగా హాలీవుడ్ హీరోలా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుంది. త్వరలోనే సెట్స్ మీదకెళ్లనుంది.