Guntur Kaaram: మూడో రోజు ర‌మ‌ణ‌గాడు వీరవిహారం.. మూడు రోజుల క‌లెక్ష‌న్ ఎంతంటే!

ABN , Publish Date - Jan 15 , 2024 | 01:08 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ భారీ అంచ‌నాల మ‌ధ్య‌ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం రికార్డు క‌లెక్ష‌న్ల‌తో దూసుకెళుతున్న‌ది. మూడో రోజు కూడా రెండంకెల పైనే వ‌సూళ్లు సాధించి మ‌హేశ్‌బాబు స్టామినాను తెలిపింది.

Guntur Kaaram: మూడో రోజు ర‌మ‌ణ‌గాడు వీరవిహారం.. మూడు రోజుల క‌లెక్ష‌న్ ఎంతంటే!
mahesh babu

సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారీ చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. భారీ అంచ‌నాల మ‌ధ్య‌ సంక్రాంతి (Sankranthi) కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం రికార్డు క‌లెక్ష‌న్ల‌తో దూసుకెళుతున్న‌ది. సినిమా విడుద‌లైన మొద‌టిరోజు నెగిటివ్ టాక్ వ‌చ్చినా ఫ్యామిలీ ఆడియెన్స్ స‌పోర్ట్ పెర‌గ‌డంతో మూడో రోజు రెండంకెల పైనే వ‌సూళ్లు సాధించి మ‌హేశ్‌బాబు స్టామినాను తెలిపింది.

తొలి రోజున రూ.94 కోట్ల వసూళ్లను సాధించి రీజనల్ ఫిల్మ్ కేటగిరీలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. రెండో రోజూ రమణగాడు బాక్సాఫీస్ దగ్గర రాంప్ ఆడేశాడు. రెండు రోజులకుగానూ రూ. 127 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టి చ‌రిత్ర సృష్టించాడు. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 94 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని రాబట్టిన ఈ సినిమా.. రెండో రోజూ రూ. 33 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని కొల్లగొట్టింది. రెండో రోజు ఈ సినిమాకు పోటీగా థియేటర్లలో రెండు సినిమాలు (హనుమాన్, సైంధవ్ రిలీజ్) ఉన్నప్పటికీ రూ. 33 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం అంటే మాములు విషయం కాదు. అందుకే సూపర్ స్టార్ రాంపేజ్ (Super Star Rampage) ఇది అని కామెంట్స్ చేస్తూ.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అభిమానం చాటుకుంటున్నారు. (Mahesh Babu Guntur Kaaram Movie)


తాజాగా మేకర్స్ మూడు రోజుల కలెక్షన్స్ పోస్టర్‌ను విడుదల చేయ‌గా (Guntur Kaaram 3 Days Collections) ఇందులోనూ మ‌హేశ్‌ బాబు ఎపెక్ట్ స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌లిపి మూడో రోజు 64.57 కోట్లు వ‌సూలు చేసింది. నిజాంలో (Nizam) 28.42 కోట్లు, సీడెడ్ (Ceeded) - 7.11 కోట్లు, Guntur 6.87 కోట్లు, ఈస్ట్ ( East) 5.69 కోట్లు, కృష్ణ‌ (Krishna) 4.03 కోట్లు, వెస్ట్ (West) 3.75 కోట్లు, నెల్లూరు (Nellore), 2.30 కోట్లు, అమెరికా (UA) - 6.4 కోట్ల చొప్పున వ‌సూలు చేసింది. మ‌రో రెండు రోజులు సెల‌వు దినాలు ఉండ‌డంతో క‌లెక్ష‌న్లు మ‌రింత‌గా వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ‌ల్లో క‌లిపి 108 కోట్లు, క‌ర్ణాట‌క, రెస్టాఫ్ ఇండియాల్లో 23 కోట్లు, ఓవ‌ర్ సీస్‌లో 33 కోట్లు రాబ‌ట్టింది. మొత్తంగా మూడు రోజుల‌కు గాను ప్ర‌పంచ వ్య‌ప్తంగా(Worldwide Gross) 164 కోట్ల గ్రాస్‌ను రాబ‌ట్టింది.

వాస్తవానికి ఈ సినిమాకు మొదటి రోజు టాక్ అంత బాగా ఏం రాలేదు. అది, ఇది అంటూ కొందరు కావాలని సినిమాపై వీప‌రీతంగా నెగిటివ్ ప్రచారం చేసినా,ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మ‌హేశ్‌బాబు ముందు అవేం నిలబడ లేదు. మొద‌ట్లో కాస్త వెన‌క‌బ‌డ్డ‌ట్టు మ‌న‌కు అనిపించిన‌ప్ప‌టికీ మూడో రోజు (ఆదివారం),నాలుగో రోజు సోమ‌వారం కూడా ఈ సినిమాకు హౌస్‌ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయంటే.. ప్రేక్షకులు ఈ సినిమాని ఎలా ఓన్ చేసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.

Updated Date - Jan 15 , 2024 | 02:56 PM