Mahesh Babu: మల్టీప్లెక్స్‌ల బాట పట్టిన సూపర్ స్లార్లు.. ఏకంగా అక్కడ థియేటర్ ఓపెన్ చేస్తోన్న మహేశ్ బాబు
ABN , Publish Date - Feb 27 , 2024 | 04:14 PM
సినిమాలంటే చాలామందికి మొదటగా గుర్తుకు వచ్చే పేరు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్. ఇక్కడ సినిమా చూస్తేనే చూసినట్టుగా ఉంటుందని, ఇక్కడ ఆడితేనే సినిమా హిట్ అవుతుందనేంతగా ఈ ప్రాంతానికి పేరుంది. అయితే మహేశ్ బాబు ఇక్కడ ఓ మల్లీఫ్లెక్స్ ను నిర్మించబోతున్నట్లు సమాచారం.
సినిమాలంటే చాలామందికి మొదటగా గుర్తుకు వచ్చే పేరు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్. ఇక్కడ సినిమా చూస్తేనే చూసినట్టుగా ఉంటుందని, ఇక్కడ ఆడితేనే సినిమా హిట్ అవుతుందనేంతగా ఈ ప్రాంతానికి పేరుంది, దాదాపు 4,5 దశాబ్దాలుగా ప్రేక్షకులకు ఎనలేని అనుభూతులు మిగిల్చిన ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మల్టీప్లెక్స్‌ల ప్రవేశం అనంతరం కూడా తమ ఉనికిని కాపాడుకుంటూ సినీ లవర్స్‌కు ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ వస్తున్నాయి.
ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సంధ్య 35 MM, సంధ్య 70 MM, సుదర్శన్ 35 MM, సుదర్శన్ 70 MM, దేవి, సప్తగిరి, ఓడియన్ కాంప్లెక్స్, మయూరి, ఉషా మయూరి థియేటర్లు చాలాకాలం ప్రేక్షకులను అలరించగా కాలక్రమంలో ఉషా మయూరి, మయూరి థియేటర్లు పూర్తిగా మూతపడ్డాయి. మరో థియేటర్ ఓడియన్ కాంప్లెక్స్ ఆధునీకరణ పనులు జరుపుకుని ప్రారంభానికి సిద్ధమవుతుండగా, అదేక్రమంలో సుదర్శన్ 70 MM కూడా తిరిగి కొత్త బిల్గింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతోంది.
2005 తర్వాత మల్టీఫ్లెక్స్ ల హవా పెరుగుతూ వస్తుండడంతో చాలామంది సింగిల్ స్క్రీన్ థియేటర్ల స్థానంలో మల్టీప్లెక్స్ ల నిర్మాణం వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఒక్క హైదరాబాద్ లోనే 30, 40 వరకు మల్టీ ఫ్లెక్స్ లు ఉన్నాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
క్రమేణా వీటి సంఖ్య దేశ వ్యాప్తంగా పెరిగి పోగా పెద్ద పెద్ద వ్యాపార వేత్తలతో పాటు సినిమా హీరోలు కూడా వీటి బాట పడుతున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు AMB సినిమాస్ (AMB Cinemas ), అల్లు అర్జున్ AAA సినిమాస్, విజయ్ దేవరకొండ AVD సినిమాస్ ను విజయవంతంగా నడుపుతున్నారు.
అయితే ఈ సందర్భంగా ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేంటంటే కొత్తగా కన్స్ట్రక్షన్ జరుపుకుంటున్న సుదర్శన్ 70 MM థియేటర్ స్థానంలో మహేశ్ బాబు (Mahesh Babu) తన AMB సినిమాస్ ను తీసుకురానున్నట్లు, అక్కడ 7 స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక్కడే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ వైజాగ్ లోని ఇనార్బిట్ మాల్ లోను AMB సినిమాను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా మాస్ మహారాజా కూడా మల్లీఫ్లెక్స్ బాట పట్టినట్లు తెలుస్తోంది. దిల్ షుక్ నగర్ లో ఇటీవలే కూల్చివేసిన సింగిల్ స్క్రీన్ థియేటర్ వెంకటాద్రి స్థానంలో 6 స్క్రీన్లతో ART Cinemas పేరుతో ఓ మల్టీప్లెక్స్ ను నిర్మించనున్నట్లు సమాచారం.