Nimmakuru Master: హీరోగా మాధవపెద్ది వార‌సుడు.. క్లాప్ కొట్టిన మంత్రి పొన్నం

ABN , Publish Date - Jun 16 , 2024 | 06:18 PM

ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ చంద్ర మనవడు 'శ్యామ్ సెల్వన్ ను హీరోగా పరిచయం చేస్తూ.. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ టైటిల్ పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం నిమ్మకూరు మాస్టారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం అన్నపూర్ణ స్టూడియోలో వైభవంగా జరిగింది.

Nimmakuru Master: హీరోగా మాధవపెద్ది వార‌సుడు.. క్లాప్ కొట్టిన మంత్రి పొన్నం
Nimmakuru Master

ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ చంద్ర మనవడు 'శ్యామ్ సెల్వన్ (Shyam Selvan) ను హీరోగా పరిచయం చేస్తూ.. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) టైటిల్ పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం "నిమ్మకూరు మాస్టారు (Nimmakuru Master). జె.ఎమ్.సినీ ఫ్యాక్టరీ పతాకంపై యువ నిర్మాత జె.ఎమ్.ప్రదీప్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అముదేశ్వర్ దర్శకత్వం వ‌హిస్తున్నారు. మాధవపెద్ది సురేష్ చంద్ర సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రంలోని అన్ని పాటలకు ప్రముఖ కవి, గీత రచయిత జొన్నవిత్తుల సాహిత్యం సమకూరుస్తున్నారు.

WhatsApp Image 2024-06-16 at 5.47.37 PM.jpeg

ఈ చిత్రం ప్రారంభోత్సవం అన్నపూర్ణ స్టూడియోలో వైభవంగా జరిగింది. రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) సహా యూనిట్ సభ్యులందరూ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖామంత్రి పొన్నం ప్రభాకర్.. హీరో శ్యామ్ సెల్వన్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాధవపెద్ది సురేష్ చంద్ర, గీత రచయిత జొన్నవిత్తుల, చిత్ర కథానాయకుడు శ్యామ్ సెల్వన్, నిర్మాత జె.ఎమ్.ప్రదీప్, దర్శకుడు అముదేశ్వర్ పాల్గొని చిత్ర విశేషాలు వెల్లడించారు.


WhatsApp Image 2024-06-16 at 5.47.38 PM (1).jpeg

తమ కుటుంబం నుంచి ఐదో తరం వాడైన తన మనవడు శ్యామ్ సెల్వన్ (Shyam Selvan) హీరోగా పరిచయం అవుతుండడం గర్వంగా ఉందని మాధవపెద్ది సురేష్ చంద్ర అన్నారు. ఒక గొప్ప ఉదాత్తమైన కథాంశంతో రూపొందుతున్న నిమ్మకూరు మాస్టారు (Nimmakuru Master) జాతీయ స్థాయి అవార్డులు గెలుచు కోవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. జొన్నవిత్తుల మాట్లాడుతూ.. ఈ చిత్రంలో సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉందని, పాటలన్నీ అద్భుతంగా ఉంటాయన్నారు. ముఖ్యంగా ఒక పాట చిరస్థాయిగా నిలిచిపోతుందని ప్రకటించారు. మాధవపెద్ది ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తు.. "నిమ్మకూరు మాస్టారు" ఒకెత్తు కానుందని జొన్నవిత్తుల అన్నారు.

WhatsApp Image 2024-06-16 at 5.47.38 PM.jpeg

రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) వంటి లెజెండ్ తో స్క్రీన్ షేర్ చేసుకోనుండడం ఎంతో ఉద్వేగంగా ఉందని హీరో శ్యామ్ సెల్వన్ (Shyam Selvan) అన్నారు. మాధవపెద్ది, జొన్నవిత్తుల, రాజేంద్ర ప్రసాద్ వంటి లెజెండ్స్ తో "నిమ్మకూరు మాస్టారు" వంటి గొప్ప చిత్రాన్ని నిర్మించే అవకాశం లభించడం అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నానని నిర్మాత జె.ఎమ్.ప్రదీప్ పేర్కొన్నారు. తమిళంలో శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రభు - కమల్ హాసన్ లతో ఓ సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన తనకు.. "నిమ్మకూరు మాస్టారు" (Nimmakuru Master) వంటి చిత్రంతో తెలుగులో ప్రవేశించే అవకాశం లభించడం గర్వంగా ఉందని అముదేశ్వర్ తెలిపారు, ఈనెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని, రాజమండ్రిలో ఒక షెడ్యూల్ చేస్తున్నామని వివరించారు.

Updated Date - Jun 16 , 2024 | 06:18 PM