Movie Artists Association: ట్రోలింగ్‌ ఛానళ్లపై డీజీపీకి ఫిర్యాదు!

ABN , Publish Date - Jul 18 , 2024 | 04:08 PM

తెలంగాణ డీజీపీకి మా( Maa association) అసోసియేషన్‌ ఫిర్యాదు చేసింది. అసోసియేషన్‌ తరపున శివబాలాజీ(Shiva Balaji), రాజీవ్‌ కనకాల, సీనియర్‌ నటుడు శివకృష్ణ డీజీపీని కలిశారు. సోషల్‌ మీడియాలో నటులపై వస్తున్న ట్రోలింగ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.


తెలంగాణ డీజీపీకి మా( Maa association) అసోసియేషన్‌ ఫిర్యాదు చేసింది. అసోసియేషన్‌ తరపున శివబాలాజీ(Shiva Balaji), రాజీవ్‌ కనకాల, సీనియర్‌ నటుడు శివకృష్ణ డీజీపీని కలిశారు. సోషల్‌ మీడియాలో నటులపై వస్తున్న ట్రోలింగ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. మా అసోసియేషన్‌, నటీనటులపై అసభ్యకరమైన ప్రచారం చేస్తున్న వారిపై చర్యలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐదు యూట్యూబ్‌  ఛానళ్లను నిషేదించాలని డీజీపీని కలిసి మా అసోసియేషన్‌ తరపున విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 5 యూ ట్యూబ్‌  ఛానళ్లపై చర్యలు తీసుకోవాలంటూ యూట్యూబ్‌ ప్రతినిధులకు  ఫిర్యాదు చేసిన కాపీని డీజేపీకి అందచేశారు మా సభ్యులు. ఇప్పటి వరకు 25 యూట్యూబ్‌ ఛానళ్లను టెర్మినేట్‌ చేశామని  డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. అసోసియేషన్  పరిధిలో సైబర్‌ క్రేౖమ్‌ టీమ్‌ను పెట్టుకున్నామని డీజీపీకి తెలిపారు. 


Maa.jpg

సైబర్‌ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి కో ఆర్డినేషన్‌ కమిటి ఏర్పాటు చేయబోతున్నామని కూడా వెల్లడించారు. ట్రోల్‌ చేసే  వాళ్ళు టెర్రరిస్టులతో సమానమనీ, లేడీ ఆర్టిస్టులపై వస్తున్న ట్రోల్‌ చాలా దారుణంగా ఉన్నాయి అని అన్నారు. క్యారెక్టర్స్‌ను కించ పరిచేలా ట్రోల్‌ చేస్తూ, పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారని, దీని వల్ల కుటుంబాలు చాలా బాధపడుతున్నాయని అన్నారు. వీటికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలనే డీజీపీని కలిసి ఫిర్యాదు చేశామని తెలిపారు మా సభ్యులు. ఈ అంశంలో డీజీపీ సానుకూలంగా స్పందించారని సైబర్‌ సెక్యూరిటీ వింగ్లో స్పెషల్‌ సెల్‌ దీని మీద ఫోకస్‌ పెడుతుందని చెప్పారని వెల్లడించారు. 

Updated Date - Jul 18 , 2024 | 06:32 PM