Tollywood: అల్లు అర్జున్ ఎఫెక్ట్.. ‘మా’ మంచు విష్ణు అలెర్ట్

ABN , Publish Date - Dec 25 , 2024 | 12:12 PM

ప్రస్తుతం టాలీవుడ్‌లో జరుగుతున్న పరిణామాలపై మా ప్రెసిడెంట్ మంచు విష్ణు అలెర్ట్ అయ్యారు. ఇలాంటి సమయంలో అందరూ యూనిటీగా ఉండాలని మా సభ్యులకు పిలుపునిస్తూ.. ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇందులో మంచు విష్ణు ఏమన్నారంటే..

MAA President Manchu Vishnu

ప్రస్తుతం టాలీవుడ్‌లో కొన్ని విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్‌పై కేసు వ్యవహారంలో టాలీవుడ్‌ని నేషనల్ మీడియా హైలెట్ చేస్తోంది. అసలు అల్లు అర్జున్ కేసు ఎటు నుండి ఎటు వైపుకు వెళుతుందో అర్థం కాని పరిస్థితి. ఈలోపు టాలీవుడ్.. హైదరాబాద్ వదిలి వెళ్లిపోతుందనేలా వార్తలు. ఈ నేపథ్యంలో అలెర్ట్ అయిన ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు ఓ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఈ ప్రకటనలో..


‘‘మా సభ్యులందరికీ.. తెలియజేయునది ఏమనగా..

మన కళాకారులు ఎల్లప్పుడూ అన్ని ప్రభుత్వాల ప్రజాప్రతినిధులతో అనుబంధం, సాన్నిహిత్య సంబంధాలు కలిగి ఉంటారు. మన చిత్ర పరిశ్రమ అనేది సహకారం మరియు సృజనాత్మకతపై ఆధారపడి నడిచే పరిశ్రమ. గతంలో వివిధ ప్రభుత్వాల మద్దతు వల్ల మన చిత్ర పరిశ్రమ ఎంతో ఎదిగింది. ప్రత్యేకంగా, టాలీవుడ్ హైదరాబాదులో స్థిరపడటానికి, అప్పటి ముఖ్యమంత్రి చెన్నా రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం అత్యంత ముఖ్యమైనది. ఈ విధంగా, ప్రతి ప్రభుత్వంతో మన పరిశ్రమకు ఎల్లప్పుడూ సత్సంబంధాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఈ సందర్భంగా కొన్ని విషయాలను చెప్పదలిచాను.

Also Read-ఎన్టీఆర్ విషయంలో మాట మార్చిన కౌశిక్ తల్లి.. ఏమందంటే


ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని, సభ్యులందరూ సున్నితమైన విషయాలపై వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా ప్రకటించడం గానీ, వివాదాస్పద అంశాలలో పక్షాలు తీసుకోవడాన్ని గానీ చేయవద్దు. కొన్ని సమస్యలు వ్యక్తిగతమైనవి, మరికొన్ని విషాదకరమైనవి, వాటిపై చట్టం తన దారిలో తను న్యాయం చేస్తుంది. అలాంటి అంశాలపై మాట్లాడటం వల్ల అది సమస్యలను పరిష్కరించడానికి బదులుగా, సంబంధిత పక్షాలకు మరింత నష్టం చేస్తుంది. ఈ సమయంలో మనకి సహనం, సానుభూతి, మరియు యూనిటీ అవసరం.


రాబోయే పండుగల సందర్భంగా, అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఓ పెద్ద కుటుంబం అనే సంగతి గుర్తించుకుందాం. ఏ సమస్యలు వచ్చినా, మనమంతా కలిసి అవన్నీ ఎదుర్కొందాం’’ అని మంచు విష్ణు ఓ ప్రకటనను విడుదల చేసినట్లుగా తెలుస్తోంది.

Also Read-Jr NTR: అభిమాని కోసం ఎన్టీఆర్.. కేన్సర్‌తో పోరాడిన ఫ్యాన్

Also Read-Sandhya Theatre Stampede: అల్లు అర్జున్‌ని కాపాడటం కోసం మహా కుట్ర

Also Read-Rewind 2024: ఈ ఏడాది అగ్ర హీరోల మెరుపులు ఏమాత్రం..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 25 , 2024 | 12:12 PM