Lucky Bhaskar:  15 దేశాల్లో టాప్‌ 10 సినిమాల్లో

ABN , Publish Date - Dec 03 , 2024 | 09:45 AM

‘లక్కీ భాస్కర్‌ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్రీమింగ్‌ అవుతోంది. ఓటీటీలో విడుదలైనప్పటి నుంచి అక్కడ కూడా టాప్‌వన్‌లో కొనసాగుతోంది. దీనికి సంబంధించి ఫ్యాన్స్‌కు దుల్కర్‌ సల్యాన్‌ కృతజ్ఞతలు చెప్పారు.  


దుల్కర్‌ సల్మాన్‌(Dulquer Salman) , మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) జంటగా నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్‌’ (Lucky Bhaskar). వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్‌ క్రైమ్‌ డ్రామాకు థియేటర్‌లలో చక్కని ఆదరణ దక్కింది. తాజాగా ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్రీమింగ్‌ అవుతోంది. ఓటీటీలో విడుదలైనప్పటి నుంచి అక్కడ కూడా టాప్‌వన్‌లో కొనసాగుతోంది. దీనికి సంబంధించి ఫ్యాన్స్‌కు దుల్కర్‌ సల్యాన్‌ కృతజ్ఞతలు చెప్పారు.  

‘‘లక్కీ భాస్కర్‌’ విడుదలైన అన్ని భాషల్లోనూ మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే ప్రేమను నెట్‌ఫ్లిక్స్‌లోనూ చూపుతున్నారు. ఈ సినిమా 5 భాషల్లో విడుదలైంది. వాటిలో మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో నేనే డబ్బింగ్‌ చెప్పాను. కన్నడ, హిందీ భాషల్లో డబ్బింగ్‌ చెప్పడానికి సమయం లేదు. ఈసారి చేేస సినిమాలకు 5 భాషల్లోనూ నేనే డబ్బింగ్‌ చెప్పడానికి ప్రయత్నిస్తా. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన నాటినుంచి ఎన్నో మెసేజ్‌లు వస్తున్నాయి. అందరికీ ధన్యవాదాలు’ అని తెలిపారు. ఇటీవల నిర్మాణ సంస్థ కూడా దీనిపై పోస్ట్‌ పెట్టిన విషయం తెలిసిందే. 15 దేశాల్లో టాప్‌ 10 సినిమాల్లో ‘లక్కీ భాస్కర్‌’ మొదటి (lucky Bhaskar in First rank) స్థానంలో నిలిచిందని తెలిపింది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ అయ్యేవరకు ఎన్టీఆర్‌ నటించిన ‘దేవర’నే టాప్‌వన్‌లో ఉంది. ులక్కీ భాస్కర్‌’ వచ్చిన తర్వాత ‘దేవర’ టాప్‌3లోకి వెళ్లింది.

ప్రస్తుతం దుల్కర్‌ ‘కాంత’, ‘ఆకాశంలో ఒక తార’ చిత్రాలు చేస్తున్నారు.   తాజాగా మరో కొత్త సినిమాకు  ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. ఈ చిత్రంతో రవి అనే కొత్త దర్శకుడు వెండితెరకు పరిచయం కానున్నారని, హీరోయిన్‌గా పూజాహెగ్డే పేరు పరిశీలనలో ఉందని తెలుస్తోంది.



Updated Date - Dec 03 , 2024 | 09:55 AM