Lucky Baskhar Trailer: డబ్బు ఇచ్చే కిక్ ఎక్కువ

ABN , Publish Date - Oct 21 , 2024 | 07:38 PM

సిగరెట్, అల్కహాల్, డ్రగ్స్ ఇచ్చే కిక్ కన్నా డబ్బు ఇచ్చే కిక్ ఎక్కువ" వంటి పదునైన సంభాషణలు ఆకట్టుకున్నాయి.

'మహానటి', సీతా రామం' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమయ్యారు దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) . తాజాగా  ఆయన  తెలుగులో నటించిన చిత్రం 'లక్కీ భాస్కర్'.  వెంకీ అట్లూరి దర్శకత్వంలో సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది.   'సాధారణ మనిషి యొక్క అసాధారణ ప్రయాణం'గా 'లక్కీ భాస్కర్' చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ఆకట్టుకొని సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. సోమవారం  ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేసారు.  ట్రైలర్ లో "Sumathi, I'm not bad, I'm just rich", "సిగరెట్, అల్కహాల్, డ్రగ్స్ ఇచ్చే కిక్ కన్నా డబ్బు ఇచ్చే కిక్ ఎక్కువ" వంటి పదునైన సంభాషణలు ఆకట్టుకున్నాయి.

దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ "14 నెలల తర్వాత నా నుంచి వస్తున్న సినిమా 'లక్కీ భాస్కర్'. ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ఇది నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. హాస్యం, భావోద్వేగాలు కలగలిపిన చిత్రమిది.  కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఉంటాయి" అని అన్నారు. 

Lucky.jpg

 మీనాక్షి చౌదరి మాట్లాడుతూ(MeenakshiChaudhary) "ఇప్పటివరకు నేను చేసిన పాత్రల్లో సుమతి పాత్ర నాకు బాగా ఇష్టమైన పాత్ర. ఈ 'లక్కీ భాస్కర్' అనేది నా మనసుకి బాగా దగ్గరైన చిత్రం. ఈ సినిమాలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది.  దుల్కర్ గారితో కలిసి నటించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది" అన్నారు.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ "సినిమాలో ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది. బ్యాంకింగ్ నేపథ్యంలో కుటుంబం భావోద్వేగాలతో నడిచే ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది." అన్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న 'లక్కీ భాస్కర్' చిత్రం తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

Updated Date - Oct 21 , 2024 | 07:38 PM