మొగిలయ్య మరణం.. కేటీఆర్‌ స్పందన ఇదే!

ABN , Publish Date - Dec 19 , 2024 | 11:40 AM

మొగిలయ్య మరణ వార్త తెలుసుకున్న కేటీఆర్‌ స్పందించారు. ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు.

‘బలగం’ Balagam) సినిమాతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న జానపద కళాకారుడు మొగిలయ్య (Mogilaiah-67)) కన్నుమూశారు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్ల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన బలగం సినిమా క్లైమాక్స్ లో మొగిలయ్య భావోద్వేగభరితమైన పాట పాడి ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నారు. ప్రతి ఒక్కరి చేత కంట తడి పెట్టించే పాట అది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో మొగిలయ్యకు గుర్తింపు వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్నాయని తెలుసుకున్న చిరంజీవి చికిత్స కోసం చిరంజీవి, 'బలగం' దర్శకుడు వేణు (Venu) ఆర్థిక సాయం చేశారు.
మొగిలయ్య మరణ వార్త తెలుసుకున్న కేటీఆర్‌ (KTR) స్పందించారు. ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు.
 
"నీ పాటకు
చెమర్చని కళ్ళు లేవు
చలించని హృదయం లేదు
నీ పాట ద్వారా
తెలంగాణ ప్రేమైక జీవనాన్ని ఆవిష్కరించావ్‌
మాయమైపోతున్న కుటుంబ సంబంధాలను మళ్లీ గుర్తు చేసింది!


మొగులన్నా..
నీ పాట తెలంగాణ బలగాన్ని మళ్లీ చాటింది!
మానవీయకోణాన్ని ఆకాశమంత ఎత్తులో నిలిపింది!
మొగులయ్య గారు మరణించినా పాట రూపంలో బతికే ఉంటారు"
వారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలి అని ఎక్స్‌లో పేర్కొన్నారు. 

Updated Date - Dec 19 , 2024 | 11:44 AM