R Narayanamurthy: అండగా ఉంటామని భరోసా

ABN , Publish Date - Jul 20 , 2024 | 01:31 PM

అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్‌.నారాయణమూర్తికి ( R Narayana Murthy) అండగా ఉంటామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) హామీ ఇచ్చారు.

అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్‌.నారాయణమూర్తికి ( R Narayana Murthy) అండగా ఉంటామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) హామీ ఇచ్చారు. ఆయన్ను ఫోన్ లో  పరామర్శించారు. ఆర్‌ నారాయణ మూర్తికి  అన్ని విధాల అండగా ఉంటామని కేటీఆర్‌ తెలిపారు. ఇటీవల అనారోగ్యంతో నిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు నారాయణమూర్తి.  తన ఆరోగ్యం విషయంలో అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పంజాగుట్ట నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నానని, దేవుడి దయవల్ల బాగానే కోలుకుంటున్నట్టు చెప్పారు. పూర్తిగా కోలుకున్న తర్వాత అన్ని వివరాలు వెలడిస్తానని నారాయణ మూర్తి ఓ ప్రకటనతో తెలిపారు. (KTRBRS)



Updated Date - Jul 20 , 2024 | 01:31 PM