KS Ravindra: వరుసగా పెద్ద హీరోలతోనే..

ABN , Publish Date - Dec 27 , 2024 | 08:30 AM

రెండేళ్ల క్రితం వాల్తేరు వీరయ్యతో (waltair veerayya) సంక్రాంతి పండగకు బాక్సాఫీస్‌ షేక్‌ చేశాడు బాబీ. రాబోయే సంక్రాంతికి నందమూరి బాలకృష్ణతో 'డాకూ మహారాజ్‌’తో (Daaku Mahraj) రాబోతున్నారు.

రెండేళ్ల క్రితం వాల్తేరు వీరయ్యతో (waltair veerayya) సంక్రాంతి పండగకు బాక్సాఫీస్‌ షేక్‌ చేశాడు బాబీ. రాబోయే సంక్రాంతికి నందమూరి బాలకృష్ణతో 'డాకూ మహారాజ్‌’తో (Daaku Mahraj) రాబోతున్నారు. ఈ చిత్రం తర్వాత వాట్‌ నెక్ట్స్‌ బాబీ (what next bobby) అంటే స్టార్‌ హీరోలతోనే అని వినిపిస్తుంది. ఇప్పటికే చిరంజీవితో మరో సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. రజనీకాంత్‌తో (Rajinikanth) కూడా బాబీ ఓ సినిమా చేయబోతున్నాడని టాక్‌ నడిచింది. అయితే ఈ విషయాలపై బాబీ క్లారిటీ ఇచ్చారు. రజనీకాంత్‌ని కలిసి కథ చెప్పిన మాట నిజమే అని, ఆ ప్రాజెక్ట్‌ త్వరలోనే ఉంటుందని చెప్పుకొచ్చాడు బాబీ. అంతే కాదు చిరంజీవితోనూ (Chiranjeevi) ఓ సినిమా ఉంటుందని అన్నారు. అయితే ఈ రెండు సినిమాల్లో ఏది ముందు? ఏది వెనుక? అనేది తెలియాల్సి ఉంది. ఆయన మాట్లాడుతూ.. ’’నేను పని చేసిన హీరోలందరూ మంచివాళ్లే. వాళ్లతో మళ్లీ మళ్లీ పనిచేయాలని వుంది. రవితేజ, వెంకటేష్‌, నాగచైతన్య.. వీళ్లందరితోనూ రిపీట్‌గా వర్క్‌ చేస్తా’’ అని అన్నారు.

బాబీ చిరంజీవికి పెద్ద అభిమాని అని తెలిసిందే! అంతే కాదు ఆయనతో మంచి అనుబంధం కూడా ఉంది. అది ఎంతో ప్రత్యేకమైనదని చెప్పారు. డాకూ మహారాజ్‌ టీజర్‌ రాగానే చిరంజీవి తనకు ఫోన్‌ చేసి అభినందించారని ఖుషీలో ఉన్నారు బాబీ. డాకూ మహారాజ్‌పై గట్టి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలకు చక్కని స్పందన వచ్చింది. ఇక ట్రైలర్‌ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Updated Date - Dec 27 , 2024 | 08:30 AM