Ravi Teja: కథా చర్చల్లో మాస్‌ మహారాజ్‌!

ABN , Publish Date - Jul 13 , 2024 | 04:28 PM

రవితేజ (Ravi Teja) హీరోగా 'పవర్‌' (Power) చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్‌కి పరిచయమయ్యారు కె.ఎస్‌.రవీంద్ర(బాబి- KS Ravindra). ఆ తరవాత మాస్‌, కమర్షియల్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచాడు.

రవితేజ (Ravi Teja) హీరోగా 'పవర్‌' (Power) చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్‌కి పరిచయమయ్యారు కె.ఎస్‌.రవీంద్ర(బాబి- KS Ravindra). ఆ తరవాత మాస్‌, కమర్షియల్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచాడు. చిరంజీవితో తీసిన ‘వాల్తేరు వీరయ్య’ పెద్ద హిట్‌ అయ్యింది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ  చిత్రానికి 'వీరమాస్‌’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. ఈ సినిమా తర్వాత బాబీ తీసే సినిమాపై క్లారిటీ వచ్చింది. మరోసారి ఆయన రవితేజతో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. వీరిద్దరి కాంబోలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రస్తుతం కథా రచ్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీలో వరుసగా సినిమాలు చేస్తున్నారు రవితేజ. ‘ధమాకా’తో వీరి కాంబో బాగా సెట్‌ అయ్యింది. ఇప్పుడు హరీష్‌ శంకర్‌తో చేస్తున్న ‘మిస్టర్‌ బచ్చన్‌’ని కూడా పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీనే తెరకెక్కిస్తోంది. బాబీతో పీపుల్‌ మీడియా సంస్థ గతంలో ‘వెంకీ మామా’ సినిమాని రూపొందించింది. అది కూడా కమర్షియల్‌గా లాభాలు తెచ్చిపెట్టింది. త్వరలోనే ఈ కాంబోకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

Updated Date - Jul 13 , 2024 | 05:23 PM