Krishna Vamsi - Murari: థియేటర్లు కాదు.. పెళ్లి మండపాలను తలపిస్తున్నాయి

ABN , Publish Date - Aug 09 , 2024 | 05:02 PM

నేడు సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు (Mahesh Babu) పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన ‘మురారి’ (Murari) చిత్రాన్ని రీ-రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే.

నేడు సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు (Mahesh Babu) పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన ‘మురారి’ (Murari) చిత్రాన్ని రీ-రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్స్‌లో 4కే వెర్షన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. థియేటర్స్‌ వద్ద అభిమానులు సందడి చేస్తున్నారు.  భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. పెళ్లి పాటకు సినీ ప్రియుల నుంచి మరోసారి విశేష స్పందన లభించింది. అలనాటి రామచంద్రుడు’ పాట ప్లే అవుతున్న సమయంలో కొంతమంది అభిమానులు అక్షింతలు తీసుకొని స్క్రీన్  పైకి విసిరారు. దీనిపై చిత్ర దర్శకుడు కృష్టవంశీ సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు.

 
సినిమా విడుదలై ఇన్నేళ్లు అవుతున్నా ఫ్యాన్స్ చూపిస్తున్న ఆదరణపై ఆయన ఆనందం వ్యక్తంచేశారు. ‘‘మరోసారి ‘మురారి’ సినిమాని ఇంతలా ఆదరించినందుకు ధన్యవాదాలు. ఈ సినిమా కోసం పనిచేసిన నటీనటులు, ముఖ్యంగా మహేశ్‌ ఇంకా ఆయన అభిమానులకు, చిత్రబృందానికి పేరుపేరునా కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు. మరోవైపు, ‘మురారి’ రీ రిలీజ్‌కు సంబంధించిన పలు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీనిపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ ‘‘ఇవి మూవీ థియేటర్స్‌లా లేవు. పెళ్లి మండపాలను తలపిస్తున్నాయి’’ అని కామెంట్స్‌ చేస్తున్నారు. అలాగే మహేశ్ సినీ ప్రముఖులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Updated Date - Aug 09 , 2024 | 05:03 PM