Krishna Vamsi: ఆ సినిమా పూర్తయ్యే వరకు గొడవ పడుతూనే ఉన్నారు! 

ABN , Publish Date - Jul 18 , 2024 | 12:15 PM

గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry), దర్శకుడు కృష్ణవంశీలది  (Krishna Vamsi) గురుశిష్యుల బంధం. కృష్ణవంశీ తీసిన అన్ని చిత్రాలకు సిరివెన్నెల మార్క్‌ పాటలు ఎన్నో ఉంటాయి.


గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry), దర్శకుడు కృష్ణవంశీలది  (Krishna Vamsi) గురుశిష్యుల బంధం. కృష్ణవంశీ తీసిన అన్ని చిత్రాలకు సిరివెన్నెల మార్క్‌ పాటలు ఎన్నో ఉంటాయి. వీరిద్దరి కాంబినేషన్ లో ఆణిముత్యాలాంటి పాటలెన్నో వచ్చాయి. ప్రతి పాట సందర్భానుసారంగా, అర్ధవంతంగా ఉంటాయి. పాటలో జీవితం కనిపించేంత అందంగా వీరిద్దరి కాంబినేషన్ లో పాటలుంటాయి అనడం అతిశయోక్తి కాదు. తాజాగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి మాట్లాడుతూ కృష్ణ వంశీ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. "మీరు దర్శకత్వం వహించిన చిత్రాల్లో శాస్త్రిగారికి ఇష్టమైన సినిమా ఏదని ప్రశ్నించగాు'అంతఃపురం' అని కృష్ణ వంశీ సమాధానమిచ్చారు.

WhatsApp Image 2024-07-18 at 11.59.29 AM.jpeg
 
"అంతఃపురం(Anthapuram) సినిమా ఫస్ట్‌ కాపీ ఆయన చూడలేదు. అప్పుడు హైదరాబాద్‌లో  లేరాయన. వచ్చిన తర్వాత థియేటర్‌లో చూశారు. ఆయన ఇంటికి రావడానికి ముందే నేను వాళ్ల ఇంటికి వెళ్లా. సినిమా చూసొచ్చిన శాస్త్రి గారు నేరుగా వచ్చి నన్నుగట్టిగా కౌగిలించుకుని ఐదునిమిషాలు అలాగే ఉండిపోయారు. ఏమీ మాట్లాడలేదు. ‘నీకు తెలుసా నువ్వు ఏం తీసావో’ అని అన్నారు. ఇంకా ‘మురారి’, ‘సింధూరం’, ‘నిన్నే పెళ్లాడతా’ చూసి ‘చాలా సంవత్సరాలు గుర్తుండిపోతాయి’ అన్నారు. ఇవన్నీ ఆయనకి నచ్చిన సినిమాలే. అలాగే నచ్చనివి కూడా ఉన్నాయి. ‘మొగుడు’ సినిమా చూసి ‘ఎందుకురా.. నిన్నెవరన్నా సినిమా తీయమని బతిమలాడారా’ అని తిట్టారు. చక్రం సినిమా కథ చెప్పినప్పుడు ‘హీరో చనిపోకూడదు’ అని గొడవపడ్డారు. ఆ సినిమా పూర్తయ్యే వరకు మా ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతూనే ఉంది’’ అని చెప్పారు. 

Updated Date - Jul 18 , 2024 | 12:15 PM