Koratala Siva: ఆచార్యపై కొరటాల ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ABN , Publish Date - Sep 24 , 2024 | 12:25 PM

'దేవర' మూవీ రిలీజ్‌కు సిద్దమవుతున్న వేళ మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో జోరు పెంచింది. ఓ వైపు ఇంటర్‌నెట్ లో కొరటాల శివ ఆచార్య, అల్లు అర్జున్ ప్రాజెక్ట్ పై చర్చ జరుగుతున్న నేపథ్యంలో  ఆయన ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చారు

'దేవర' (Devara)మూవీ రిలీజ్‌కు సిద్దమవుతున్న వేళ మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో జోరు పెంచింది. ఓ వైపు ఇంటర్‌నెట్ లో కొరటాల శివ ఆచార్య(Acharya) , అల్లు అర్జున్ ప్రాజెక్ట్ పై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ చర్చకి పుల్ స్టాప్ పడనుందా లేదా ఇంకో లేయర్ యాడ్ అవ్వనుందో చూడాలి. 


కొరటాల శివ (Koratala Siva) 'ఆచార్య' మూవీ ప్లాప్ తో 'దేవర' మూవీ ఎలా ఉండబోతుంది? తారక్‌ని ఎలా హ్యాండిల్ చేయగలడు అనే చర్చ విపరీతంగా జరిగింది. ఒక దశలో ఆచార్య ప్లాప్ బాధ్యత ఎవరిది అన్న సందేహాలు కూడా గుప్పుమన్నాయి. దీంతో కొరటాల ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు. ఆచార్య సినిమా ప్లాప్ తనకు దేవర తీసేటప్పుడు ఒత్తిడి కలిగించలేదని, అలాగే అందరికంటే ముందు చిరంజీవి గారే నువ్వు బౌన్స్ బ్యాక్ అవుతావు శివ అనే మెసేజ్ చేశారని అన్నారు. అంతేకాకుండా దేవరకు ముందు అల్లు అర్జున్‌తో అనుకున్న ప్రాజెక్ట్ ఇది కాదని క్లారిటీ ఇచ్చారు. కాగా, మొన్నటి వరకు అల్లు అర్జున్‌తో షెల్వ్ అయిన ప్రాజెక్ట్ దేవరనే అనే ఊహాగానాలు నడిచిన విషయం తెలిసిందే. దేవర మూవీ  ని రెండు పార్ట్ లుగా తీయడానికే కథే కారణమన్నారు. కేవలం స్టోరీ నేరేట్ చేయడానికి 4 గంటల సమయం పట్టిందని చెప్పుకొచ్చారు.

Updated Date - Sep 24 , 2024 | 04:37 PM