Klin Kaara Konidela: క్లీంకార @1.. ఉపాసన ఎమోషనల్‌ వీడియో!

ABN , Publish Date - Jun 20 , 2024 | 10:47 AM

రామ్‌ చరణ్‌, ఉపాసనల  గారాలపట్టి క్లీంకార మొదటి పుట్టినరోజు ఈరోజు. ఉపాసన ప్రసవించి ఏడాది అయింది.ఈ  విషయాన్ని చెబుతూ తన కుమార్తెకు విషెస్‌ చెబుతూ ఉపాసన ఓ ఎమోషనల్‌ వీడియో షేర్‌ చేశారు.

Klin Kaara Konidela: క్లీంకార @1.. ఉపాసన ఎమోషనల్‌ వీడియో!


రామ్‌ చరణ్‌ (Ram Charan).. ఉపాసనల  గారాలపట్టి క్లీంకార (Klin Kaara Konidela) మొదటి పుట్టినరోజు ఈరోజు. ఉపాసన ప్రసవించి ఏడాది అయింది.ఈ  విషయాన్ని చెబుతూ తన కుమార్తెకు విషెస్‌ చెబుతూ ఉపాసన ఓ ఎమోషనల్‌ వీడియో షేర్‌ చేశారు. ‘నా ప్రియమైన క్లీంకారకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ రాకతో మా జీవితాలు పరిపూర్ణమయ్యాయి. మా జీవితాల్లో ఆనందం నింపినందుకు ధన్యవాదాలు’ అంటూ ఇన్  స్టాగ్రామ్‌లో వీడియో షేర్‌ చేశారు. ఈ వీడియోను ఇప్పటికీ లెక్కలేనన్నిసార్లు చూసినట్లు ఉపాసన (Upasana Konidelaచెప్పారు.

Klin.jpg

ఆ వీడియోలో చరణ్‌, ఉపాసనతోపాటు ఇరు కుటుంబాల వారు క్లీంకార పుట్టినప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు. గతేడాది ఉపాసన పుట్టినరోజు నాడు చరణ్‌ ఈ వీడియోను షేర్‌ చేశారు(Klin Kaara Completes one year). ఇప్పుడు దాన్నే మరోసారి ఆమె అభిమానులతో పంచుకున్నారు. క్లీంకార డెలివిరీ టైమ్‌ నుంచి తమ కుటుంబంలో ఎలాంటి సందడి వాతావరణం నెలకొందో అన్న విషయాలను ఈ వీడియోలో చూపించారు. ఇక క్లీంకారకు మెగా అభిమానులతోపాటు సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘లిటిల్‌ వండర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని కాజల్‌ కామెంట్‌ పెట్టగా.. ‘హ్యాపీ బర్త్‌డే లిటిల్‌ స్టార్‌’ అని కియారా అడ్వాణీ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ రిప్లై పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్ట్టింట వైరల్‌ అవుతోంది. 

Klin-2.jpg

Updated Date - Jun 20 , 2024 | 12:09 PM