Ketika Sharma: కేతిక శర్మ మరీ ఇంత హాట్ ఏంటిరా బాబూ!

ABN , Publish Date - Jul 02 , 2024 | 05:24 PM

ఢిల్లీ అమ్మాయి అయినా కేతిక శర్మ, చేసినవి నాలుగు సినిమాలే అయినా అవన్నీ తెలుగులోనే చేసింది. ఆకాష్ పూరి పక్కన నటించి అరంగేట్రం చేసిన కేతిక వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఇద్దరు అన్నదమ్ముల పక్కన నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.

Ketika Sharma: కేతిక శర్మ మరీ ఇంత హాట్ ఏంటిరా బాబూ!
Ketika Sharma

కేతిక శర్మ ఎక్కువగా తెలుగువాళ్ళకు పరిచయం వుండే నటి. ఎందుకంటే ఆమె చేసిన నాలుగు సినిమాలు తెలుగులో చేసినవే! అందుకని ఆమె ఇక్కడ ప్రేక్షకులకు సుపరిచితం. సామాజిక మాధ్యమంలో కూడా చాలా చురుకుగా వుండే కేతిక శర్మ ఢిల్లీలో పుట్టి అక్కడే చదువుకుంది.

ketikasharmanewpic.jpg

సినిమాల్లోకి రాక ముందు కేతిక శర్మ మోడలింగ్ లో రాణించింది. దానికన్నా ముందు ఆమె సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా సామాజిక మాధ్యమంలో బాగా పరిచయం. ఆసక్తికరం ఏంటంటే ఆమె మొదటి సినిమా తెలుగులో చెయ్యడం. పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ కథానాయకుడిగా 2021లో వచ్చిన 'రొమాంటిక్' లో కేతిక శర్మ కథానాయికగా నటించింది.

ketikasharmanewpica.jpg

అదే సంవత్సరం నాగ శౌర్య కథానాయకుడిగా 'లక్ష్య' అనే సినిమాలో కథానాయికగా నటించింది. ఇది స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చిన సినిమా. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా నడవలేదు. ఆ తరువాతి సంవత్సరం వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా వచ్చిన 'రంగ రంగ వైభవంగా' అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆమె నటనకి మంచి మార్కులు పడ్డాయి. కేతిక శర్మకి తెలుగులో అవకాశాలు వస్తాయని అనుకున్నారు.

ketikasharmanewpicb.jpg

గత సంవత్సరం పవన్ కళ్యాణ్, దర్శకుడు సముద్రఖని కాంబినేషన్ లో వచ్చిన 'బ్రో' సినిమాలో కేతిక శర్మ నటించింది. ఇందులో వైష్ణవ్ తేజ్ అన్నయ్య సాయి ధరమ్ తేజ్ తన మామయ్య పవన్ కళ్యాణ్ తో నటించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమా తమిళ సినిమా 'వినోదయ సితం'కి రీమేక్. ఇలా ఇద్దరు అన్నదమ్ములతో నటించిన కేతిక శర్మ ఇప్పుడు మంచి సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.

సామాజిక మాధ్యమంలో తన ఫోటోలను ఎప్పటికప్పుడు పెడుతూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది కేతిక.

Updated Date - Jul 02 , 2024 | 05:24 PM