Keerthy Suresh: షాకింగ్ న్యూస్.. సినిమాలకి గుడ్ బై చెప్పనున్న స్టార్ హీరోయిన్
ABN , Publish Date - Dec 27 , 2024 | 06:20 AM
Keerthy Suresh: మహానటి 'కీర్తి సురేష్' తన ఫ్యాన్స్ కి బిగ్ షాక్ ఇవ్వనుందా? అవునే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. పెళ్లి తర్వాత కీర్తి ఈ షాకింగ్ డెసిషన్ తీసుకోవడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతకీ ఏమైందంటే..
మహానటి 'కీర్తి సురేష్' కొన్ని రోజులుగా వార్తల్లో తెగ ట్రెండ్ అవుతోంది. తన చిరకాల మిత్రుడు ఆంథోని తటిల్‌తో వివాహం, బాలీవుడ్ డెబ్యూ 'బేబీ జాన్' మూవీ రిలీజ్, మూవీ ప్రమోషన్స్ లో ఆమె వస్త్రధారణ ఇవన్నీ ఆమె వార్తల్లో నిలవడానికి మూలకారణం అయ్యాయి. అయితే తాజాగా కీర్తి మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మహానటి ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు. ఇంతకీ ఆ వార్త ఏంటంటే..
కీర్తి సురేష్ మూవీ 'బేబిజాన్' డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుణ్ ధావన్ హీరోగా నటించారు. అయితే ఈ సినిమా కీర్తికి డ్రీమ్ డెబ్యూ కాలేకపోయింది. ఈ సినిమాకి నార్త్ లో డిజాస్టర్ టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కీర్తి చేతిలో మరో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కీర్తి సెట్స్ పై ఉన్న సినిమాలు తప్ప కొత్త సినిమాలు యాక్సెప్ట్ చేయడం లేదట. కొంత కాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి సంసార జీవితానికే పరిమతమవాలని ఆమె భావిస్తోందట. దీంతో కీర్తి ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
ఇక 'బేబీ జాన్' విషయానికొస్తే.. వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జంటగా నటించారు. బాలీవుడ్ డైరెక్టర్ కాలీస్ దీన్ని తెరకెక్కించాడు. వామికా గబ్బీ, జాకీష్రాఫ్ కీలక పాత్రల్లో నటించారు. కోలీవుడ్‌లో విజయాన్ని అందుకున్న ‘తెరీ’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కగా, ‘తెరీ’ డైరెక్టర్ 'అట్లీ' బాలీవుడ్ వెర్షన్ కి రచయితగా, నిర్మాతగా వ్యవహరించారు.