Keerthy Suresh: శ్రీలీల కంటే కీర్తి నయం..‘కిస్సిక్‌’

ABN , Publish Date - Nov 25 , 2024 | 03:40 PM

డ్యాన్సింగ్ క్వీన్ 'శ్రీలీల' కంటే మహానటి 'కీర్తి సురేష్'కి మంచి మార్కులు పడుతున్నాయి. అలా ఎలా సాధ్యం అనుకుంటున్నారా? ఎందుకంటే..

పుష్ప మూవీలో 'ఊ అంటావా మావ. ఊఊ అంటావా’ పాట ఎంతగా పాపులర్‌ అయిందో తెలిసిందే. దానిని మించేలా 'పుష్ప -2'లో ఐటెమ్‌సాంగ్‌ను ప్లాన్‌ చేస్తారని అభిమానులు ఎంతో వెయిట్ చేశారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఆదివారం ‘కిస్సిక్‌’ అంటూ అల్లు అర్జున్‌, శ్రీలీలపై తెరకెక్కించిన సాంగ్‌ను చెన్నైలో జరిగిన ఈవెంట్‌ లో విడుదల చేశారు. మరోవైపు మహానటి 'కీర్తి సురేష్' బాలీవుడ్ డెబ్యూ మూవీ 'బేబీ జాన్' నుండి 'నైన్ మాటక్కా' సాంగ్ రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే కీర్తి సురేష్, శ్రీలీలాలను కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏమైందంటే..


అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేమికులు ఎంతో ఎదురు చూసిన ‘కిస్సిక్‌’ సాంగ్ కాస్త డిసప్పాయింట్ చేసింది. 'ఊ అంటావా మావ.. ఊఊ అంటావా’ స్థాయి అంచనాలను ఏ మాత్రం రీచ్ కాలేకపోయింది. దీంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. స్వాగ్ కింగ్ తో పాటు డ్యాన్సింగ్ క్వీన్ కాంబోలో ఈ సాంగ్ అదిరిపోతుందని అంత భావించారు. కానీ.. ఈ సాంగ్ ట్యూన్, లిరిక్స్ అభిమానులకి నచ్చడం లేదు.


మరోవైపు ఇప్పటి వరకు ఎక్స్‌పోజింగ్‌ , రొమాంటిక్ సీన్స్ లేకుండా క్లీన్ ఇమేజ్ బిల్డ్ చేసుకున్న కీర్తి సురేష్ బాలీవుడ్ డెబ్యూ తో ఆ ఇమేజ్ ని బ్రేక్ చేసుకుంది. తాజాగా రిలీజ్ అయినా 'నైన్ మాటక్కా' సాంగ్ లో ఆమె మ్యాడ్ లెవెల్ లో అందాలు ఆరబోసింది. క్లీవేజ్‌ షో, నాభి అందాలు, థైస్ షోతో కనిపించి అభిమానులకు షాకిచ్చింది. దీనితో కీర్తిపై కూడా ట్రోలింగ్స్ షురూ అయ్యాయి. అయితే ‘కిస్సిక్‌’ సాంగ్ తో పోల్చుకుంటే 'నైన్ మాటక్కా' చాలా బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే నెక్స్ట్ వీక్ 'పుష్ప 2' నుండి రాబోతున్న సాంగ్ పై నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. దీంతో అల్లు అర్జున్ ‘కిస్సిక్‌’ ఎఫెక్ట్ మర్చిపోయేలా మాయ చేస్తారేమో వేచి చూడాల్సి ఉంది.

Updated Date - Nov 25 , 2024 | 03:40 PM