Tollywood: ‘అబద్ధమేవ జయతే’ అంటున్న కార్తికేయ..

ABN , Publish Date - Nov 25 , 2024 | 09:07 PM

అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు అని ఓ సామెత ఉంటుంది. మరి అది నిజమేనా? దీనిపై హీరో కార్తికేయ ఏమన్నారంటే..

అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు అని ఓ సామెత ఉంటుంది. మరి అది నిజమేనా? అన్న కాన్సెప్ట్‌తో ఓ కామెడీ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. సుశాంత్ యష్కీ, ప్రవణ్యా రెడ్డి, మాస్టర్ వికాస్, మాస్టర్ భాను, విజయ కృష్ణా, వెంకీ లింగం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘అబద్ధమేవ జయతే’ చిత్రానికి కె. కార్తికేయన్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్నారు. పర్పుల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై శివుడు, రాకేష్, సృజన గోపాల్ సహ నిర్మాతలుగా కొండా సందీప్, అభిరామ్ అలుగంటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

WhatsApp Image 2024-11-25 at 20.46.21 (3).jpeg


‘అబద్ధమేవ జయతే’ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను యంగ్ హీరో కార్తికేయ లాంచ్ చేశారు. టైటిల్ చాలా వెరైటీగా ఉందని అభినందిస్తూ చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. విలేజ్ డ్రామాగా రూపొందిస్తున్న ఈ చిత్రం లో ఒక ఇరవై ఏళ్ల క్రితం ఉన్న సెట్ ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతుంది. మ్యూజిక్ డైరెక్టర్ పవన్ ఈ సినిమా కి సంగీతాన్ని అందిస్తున్నారు. వికాస్ చిక్‌బల్లాపూర్ కెమెరామెన్‌గా, షాడో ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

WhatsApp Image 2024-11-25 at 20.46.21 (1).jpegWhatsApp Image 2024-11-25 at 20.46.21.jpeg


సూరారం, వేములవాడ, వికారాబాద్, రాజమండ్రి, కాకినాడ ఇలా చాలా గ్రామీణ వాతావరణంలోనే సినిమాను షూట్ చేశారు. చిత్రయూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాకు రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Updated Date - Nov 25 , 2024 | 09:07 PM