RC16 నుంచి అదిరిపోయే అప్డేట్.. తెలుగులోకి క‌న్న‌డ సూప‌ర్ స్టార్‌ ఎంట్రీ

ABN , Publish Date - Jul 12 , 2024 | 12:00 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు సానాతో తన నెక్స్ట్ పాన్ ఇండియా చిత్రం RC16 చేస్తున్న‌ విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఆస‌క్తిక‌ర అప్డేట్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

shiva rajkumar

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తన నెక్స్ట్ పాన్ ఇండియా చిత్రం RC16 కోసం.. ‘ఉప్పెన’ ఫేమ్, యంగ్ ట్యాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా (BuchiBabuSana)తో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సమర్పణలో వృద్ధి సినిమాస్ (Vriddhi Cinemas), సుకుమార్ రైటింగ్స్ (Sukumar Writings) బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు హై బడ్జెట్‌తో భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం గ‌త నెల‌లో హైదరాబాద్‌లో ప్రారంభమైన సంగ‌తి తెలిసిందే.

GSQeKLxbUAA-Skb.jpeg

తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఆస‌క్తిక‌ర అప్డేట్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ రోజు (శుక్ర‌వారం) క‌న్న‌డ సూప‌ర్ స్టార్ శివ రాజ్ కుమార్ (Dr Shiva Rajkumar) జ‌న్మ‌దినం సంద‌ర్భంగా సినిమాలో ఆయ‌న లుక్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా తెలుగు సినిమాల్లోకి ఆహ్వానిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్ట‌ర్ రిలీజ్ చేశారు.


ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) స‌ర‌స‌న జాన్వీ క‌పూర్ (JanhviKapoor ) క‌థానాయుక‌గా న‌టిస్తోండ‌గా అస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ (A.R.Rahman) సంగీతం అందిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో శివ రాజ్ కుమార్ (Dr Shiva Rajkumar) కూడా జ‌త క‌ల‌వ‌డంతో సినిమాపై అంచ‌నాలు రెండింత‌లు రెట్టింప‌య్యాయి.

Updated Date - Jul 12 , 2024 | 12:00 PM