Nag Ashwin: ఈ చిత్రానికి ఇంకా చాలా అవార్డులొస్తాయి!

ABN , Publish Date - Jun 30 , 2024 | 06:55 PM

భారీ అంచాల మధ్య విడుదలైన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. సూపర్‌హిట్‌ టాక్‌తో రోజురోజుకీ కలెక్షన్లు పెరుగుతున్నాయి.

Nag Ashwin: ఈ చిత్రానికి ఇంకా చాలా అవార్డులొస్తాయి!


భారీ అంచాల మధ్య విడుదలైన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. సూపర్‌హిట్‌ టాక్‌తో రోజురోజుకీ కలెక్షన్లు పెరుగుతున్నాయి. ‘ఈ సినిమాకి అంతర్జాతీయ అవార్డులు రావడం ఖాయం’ అనే మాట ప్రభాస్‌ ఫ్యాన్స్, సినీ ప్రియుల నోట వినిపించిన సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్‌ అవార్డులకు ఇంకా సమయం ఉందనే ఉద్దేశమో ఏమోగానీ టాలీవుడ్‌ హీరో ఒకరు ‘కల్కి’కి అవార్డు ఇచ్చారు. సంబంధిత ఫొటో షేర్‌ చేస్తూ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సోషల్‌ మీడియాలో ఆనందం వ్యక్తం చేశారు. ‘ఇది కల్కికి వచ్చిన తొలి అవార్డు’ అంటూ ఆ ఫొటోకు క్యాప్షన్‌ పెట్టారు. ఆ అవార్డు ఇచ్చిన నటుడు ఎవరో కాదు.. రానా దగ్గుబాటి. డైరెక్టర్‌ పోస్ట్‌పై స్పందించిన రానా   ‘కల్కి’కి మరిన్ని పురస్కారాలు లభిస్తాయని పేర్కొన్నారు.

Kalki.jpg

హీరో ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న సంగతి తెలిసిందే! జపానలో ప్రభాస్‌కు అభిమానుల సంఖ్య ఎక్కువ.  జపాన్‌కు చెందిన ముగ్గురు మహిళలు హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమ్యాక్స్‌లో ‘కల్కి’ సినిమాని చూసి ప్రభాస్‌పై అభిమానాన్ని చాటుకున్నారు. ఐమ్యాక్స్‌ వద్ద ప్రదర్శనకు ఉంచిన రెబల్‌ ట్రక్‌ వద్ద ఫొటోకు పోజిచ్చారు. ఆ పిక్‌ను ‘కల్కి’ టీమ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేయగా వైరల్‌ అవుతోంది. ఇక ఈ చిత్రం మూడు రోజుల్లో రూ. 415 కోట్లుకుపైగా వసూళ్లు రాబట్టిందని చిత్ర బృందం పోస్టర్‌ విడుదల చేసి తెలిపింది. రిలీజైన రోజు నుంచే సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఈ సినిమా టీమ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చిరంజీవి, రజనీకాంత్‌, మోహన్‌ బాబు, అల్లు అర్జున్‌ తదితరులు ‘కల్కి’ అద్భుతమైన చిత్రమని పేర్కొన్నారు.  
Kali-2.jpg



Updated Date - Jun 30 , 2024 | 06:55 PM