Kalki 2898 AD : కల్కి థీమ్‌ సాంగ్‌ వచ్చేసింది!

ABN , Publish Date - Jun 24 , 2024 | 02:23 PM

ప్రభాస్‌ (Prabhas) నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) జూన్‌ 27న విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది

Kalki 2898 AD : కల్కి థీమ్‌ సాంగ్‌ వచ్చేసింది!


ప్రభాస్‌ (Prabhas) నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) జూన్‌ 27న విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ‘థీమ్‌ ఆఫ్‌ కల్కి’ (Theme of Kalki) పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది. నటి శోభనతోపాటు (Sobhana) పలువురు నృతకారిణిలు మథురలో నృత్య ప్రదర్శన చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసింది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి అశ్వనీదత్  నిర్మిస్తున్నారు. ప్రభాస్‌ సరసన దీపికా పదుకోన్  నటించగా అమితాబ్‌ బచ్చన్, కమల్‌ హాస న్  దిశాపటానీ కీలక పాత్రలు పోషించారు. 

Updated Date - Jun 24 , 2024 | 02:23 PM