Kalki 2898 AD: ఇంకెంతమంది అతిథులు ఉన్నారో..!

ABN , Publish Date - Jun 22 , 2024 | 12:59 PM

ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్ (Nag Ashwin)  తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 Ad)చిత్రంలో పలు అతిథి పాత్రలున్నాయని, వైజయంతీ నెట్‌వర్క్‌ సంస్థలు నిర్మించిన చిత్రాల్లో గతంలో సందడి చేసిన కొందరు ఆ పాత్రల్లో కనిపించనున్నారని సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

Kalki 2898 AD: ఇంకెంతమంది అతిథులు ఉన్నారో..!

ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్ (Nag Ashwin)  తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 Ad)చిత్రంలో పలు అతిథి పాత్రలున్నాయని, వైజయంతీ నెట్‌వర్క్‌ సంస్థలు నిర్మించిన చిత్రాల్లో గతంలో సందడి చేసిన కొందరు ఆ పాత్రల్లో కనిపించనున్నారని సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీనిపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వలేదు. కానీ కల్కి ‘రిలీజ్‌ ట్రైలర్‌’లో ఓ హీరోయిన్‌ను చూపించి అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసింది. ఆ నటి మరెవరో కాదు.. మాళవిక నాయర్‌ (Malavika nair). గతంలో వైజయంతీ నెట్‌వర్క్‌ బ్యానర్‌లో తెరకెక్కిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’లోను ఆమె కీలక పాత్రలు పోషించి, మెప్పించారు. నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ఈ మూడు చిత్రాల్లో ఆమె నటించడం విశేషం. అదే నెట్‌వర్క్‌లో వచ్చిన ‘అన్నీ మంచి శకునములే’లోనూ ఆమె నటించింది. ట్రైలర్‌లోని తన లుక్‌ను  స్క్రీన్ షాట్ తీసి, అభిమానులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా మాళవిక ఆనందం వ్యక్తం చేశారు. వాటిని తన ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ థ్యాంక్స్‌ చెప్పారు.

Malavika.jpg

కొన్ని రోజుల క్రితం విడుదలైన తొలి ట్రైలర్‌ ద్వారా ఈ సినిమాలో ఒకప్పటి నటి హీరోయిన్‌ శోభన ఉన్నారని తెలిసింది. ఆ తర్వాత చిత్ర బృందం అధికారికంగా ఆ విషయాన్ని ప్రకటించింది. విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారని రూమర్స్‌ వచ్చాయి. నాగ్‌ అశ్విన్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ చిత్రంలో ఎన్నో సర్‌ప్రైజ్‌లుంటాయని తెలిపారు. అయితే ఆయన ఈ రోల్స్‌ గురించే చెప్పారా, వేరే దాని గురించా అనేది చూడాలి. ప్రభాస్‌ హీరోగా సైన్స్‌ ఫిక్షన్‌ కథతో రూపొందిన ఈ చిత్రంలో  అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, రాజేంద్ర ప్రసాద్‌, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. కాశీ, కాంప్లెక్స్‌, శంబల అనే మూడు ప్రపంచాల చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 27న విడుదల కానుంది.

Updated Date - Jun 22 , 2024 | 01:00 PM