Kannappa The Movie: ‘కన్నప్ప’ నుంచి.. అడివిని అంతం చేసే క్రూరుడు ‘కాలాముఖ’ లుక్ రిలీజ్‌

ABN , Publish Date - Sep 02 , 2024 | 04:50 PM

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక ఆప్డేట్ వదులుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ సోమ‌వారం ‘కాలాముఖ’ పాత్ర‌ను, న‌టుడు అర్పిత్ రంకా లుక్ పోస్టర్‌ను మూవీ టీం విడుదల చేసింది.

Kannappa

విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ (Kannappa Movie) నుంచి ప్రతీ సోమవారం ఒక ఆప్డేట్ వదులుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి శ‌ర‌త్ కుమార్ నాథనాథుడు, మ‌ధుబాల ప‌న్న‌గ‌, దేవ‌రాజ్‌ ముండ‌డు, సంప‌త్ రామ్ చుండ‌డు, ముఖేష్ రిషి ‘కంప‌డు’ లుక్స్ రిలీజ్ చేయ‌గా గ‌త వారం మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ భ‌క్త మంచు (Avram Manchu) ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల చేయ‌గా అదిరిపోయే రెస్పాన్స్ ద‌క్కించుకుంది.

ఈ క్ర‌మంలో తాజాగా ఈ సోమ‌వారం ‘కాలాముఖ’ పాత్ర‌ను, న‌టుడు అర్పిత్ రంకా (Arpit Ranka) లుక్ పోస్టర్‌ను మూవీ టీం విడుదల చేసింది. గాంధార దేశం.. వాయు లింగం సొంతం చేసుకునే ధ్యేయం.. వేలాది మంది రక్తపాతాన్ని చూసే దాహం.. అడివిని,అడవి వీరుల్ని సైతం అంతం చేసే క్రూరత్వం అంటూ కాలాముఖ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్, పోస్టర్‌ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

GWcaLitWMAABOyR.jpeg


ఇప్పటికే కన్నప్ప (Kannappa Movie) టీజర్‌తో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయన్న సంగతి తెలిసిందే. విష్ణు మంచు టైటిల్ రోల్‌లో కనిపించనున్న కన్నప్ప అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా రాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. డిసెంబర్‌లో ఈ సినిమా పాన్‌ ఇండియా వైడ్‌గా విడుదల కానుంది.

Updated Date - Sep 02 , 2024 | 04:50 PM