Jr NTR: దర్శకుడు కొరటాల శివపై ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Oct 04 , 2024 | 06:14 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘దేవర’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నట్లుగా మేకర్స్ పోస్టర్స్ విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘దేవర’ సక్సెస్ మీట్ గ్రాండ్‌గా ఉంటుందని అభిమానులు ఆశిస్తే.. ఆ ఈవెంట్ లేదని చెబుతూ.. టీమ్ అంతా సక్సెస్ పార్టీని చేసుకుంది. ఈ పార్టీలో ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఎన్టీఆర్ ఏమన్నారంటే..

Koratala Siva and Jr NTR

‘దేవర’ దర్శకుడు కొరటాల శివపై మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Man of Masses NTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘దేవర’ (Devara). నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌. కె నిర్మించిన ఈ మూవీ సెప్టెంబ‌ర్ 27న వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజైంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ (Janhvi Kapoor) క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో బాలీవుడ్ వెర్స‌టైల్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నట్లుగా మేకర్స్ పోస్టర్స్‌ విడుదల చేస్తున్నారు. అంతేకాదు, 80 శాతానికి పైగా రికవరీ అయినట్లుగా కూడా ప్రకటించారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనూహ్యంగా రద్దు కావడంతో.. సక్సెస్ మీట్ అయినా గ్రాండ్‌గా జరుపుతారేమోనని అభిమానులు ఆశపడ్డారు. సక్సెస్ మీట్ ఏమోగానీ.. మేకర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్‌ని మాత్రం గ్రాండ్‌ని నిర్వహించారు. ఆ సెలబ్రేషన్స్‌లో దర్శకుడు కొరటాల శివ (Koratala Siva)పై ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Also Read- Jr NTR: అప్పుడు లౌక్యంగా.. ఇప్పుడు డైరెక్ట్‌గా.. ఏంటిది తారక్



Devara.jpg

‘దేవర’ విడుదలకు ముందు ప్రీ రిలీజ్ వేడుకను భారీగా ప్లాన్ చేశారు. కానీ అనూహ్యంగా లెక్కకు మించి అభిమానులు రావడంతో.. చివరి నిమిషంలో ఆ వేడుకను రద్దు చేశారు. ఇక సినిమా విడుదలై మంచి కలెక్షన్స్ వచ్చినట్లుగా మేకర్స్ విడుదల చేస్తున్న పోస్టర్స్ చెబుతున్న క్రమంలో.. సక్సెస్ మీట్ అయినా గ్రాండ్‌గా చేస్తారేమో అనుకుంటే.. నిర్మాత నాగవంశీ సారీ చెప్పేశారు. అంటే సక్సెస్ మీట్ లేదని అధికారికంగా క్లారిటీ ఇచ్చేశారు. అభిమానుల కోసం సక్సెస్ మీట్ అయితే నిర్వహించలేదు కానీ.. ఇండస్ట్రీ ప్రముఖులతో ‘దేవర’ సక్సెస్ పార్టీ (Devara Success Party)ని మాత్రం మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ పార్టీకి చిత్ర బృందంతో పాటు రాజ‌మౌళి, ప్ర‌శాంత్ నీల్‌, దిల్ రాజు తదితరులు హాజ‌రు అయ్యారు.


ఈ సక్సెస్ పార్టీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) మాట్లాడుతూ.. ‘‘కొరటాల శివతో ‘బృందావనం’ మూవీ నుంచి నా ప్ర‌యాణం మొద‌లైంది. కొరటాల శివ మా కుటుంబ సభ్యుడిగా మారారు. ‘దేవర 2’ చిత్రీకరణ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నాకు, కళ్యాణ్ రామ్ అన్నయ్యకు హరికృష్ణ కొసరాజు వెన్నెముకలాంటి వారు. అతని వల్లే ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది’’ అని అన్నట్లుగా తెలుస్తోంది.

Also Read- Thalapathy 69: విజయ్ లాస్ట్ సినిమా ఓపెనింగ్‌లో ఏం జరిగిందో తెలుసా?

Also Read- Tollywood: సినిమాల కరువులో.. టాలీవుడ్ భామలు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 04 , 2024 | 06:14 PM