Jr NTR: ‘దేవర’ ప్రీ రిలీజ్ వేడుక, సక్సెస్ మీట్ లేకపోవడంతో.. తారక్ ఏం చేశారంటే

ABN , Publish Date - Oct 15 , 2024 | 04:03 PM

‘దేవర’ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. సినిమా విడుదల తర్వాత కోట్లలో కలెక్షన్స్ వచ్చినట్లుగా మేకర్స్ చెబుతూ పోస్టర్స్ విడుదల చేస్తున్నారు కానీ.. సక్సెస్ మీట్ మాత్రం ఏర్పాటు చేయలేదు. నిర్మాత నాగవంశీ ‘దేవర’కు సక్సెస్ మీట్ కూడా ఉండదని ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఇంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత తారక్ స్పందన వినడానికి ఫ్యాన్స్‌కు వేదిక కరువైంది. అయితేనేం.. అలాంటి ఫ్యాన్స్ అందరి కోసం తారక్ ఏం చేశారంటే..

Jr NTR

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Man Of Masses Jr NTR) నటించిన ‘దేవర’ (Devara) చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 500 ప్లస్ కోట్లను రాబట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా పోస్టర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొదటి నుండి ఈ సినిమాపై, కలెక్షన్లపై రకరకాలుగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అలాగే ఈ సినిమా గురించి చెప్పడానికి హీరో ఎన్టీఆర్‌కు కూడా సరైన వేదిక దొరకలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం, సక్సెస్ మీట్ లేకపోవడంతో.. తన సినిమా రూ. 500 ప్లస్ కోట్ల క్లబ్‌లో చేరిన ఆనందాన్ని ఓ లేఖ ద్వారా తెలియజేశారు తారక్. తాజాగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఎన్టీఆర్ ఓ లేఖను విడుదల చేశారు. ఈ లేఖ‌లో.. (Tarak Letter on Devara Success)

‘‘ ‘దేవర పార్ట్ 1’కి అందుతున్న అద్భుతమైన స్పందనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమా ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది.

నా సహ నటులైన సైఫ్ అలీ ఖాన్ సర్, జాన్వీ, ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ గారు మరియు ఇతర నటీనటులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారు తమ పాత్రలకు ప్రాణం పోసి, మా కథకు జీవం ఇచ్చారు.

నా దర్శకుడు కొరటాల శివగారికి ధన్యవాదాలు. ఈ కథను సృష్టించిన ఆయన దిశానిర్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ విజయవంతమైంది. అనిరుధ్ అద్భుతమైన సంగీతం, రత్నవేలు సర్ సినిమాటోగ్రఫీ, సాబు సార్ ప్రొడక్షన్ డిజైన్, యుగంధర్ గారు వీఎఫ్‌ఎక్స్, శ్రీకర్ ప్రసాద్‌గారు ఎడిటింగ్‌తో ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచినందుకు ధన్యవాదాలు.

మా సినిమాను విజయవంతంగా ప్రదర్శించిన పంపిణీదారులు మరియు థియేటర్ ప్రదర్శకులకు ధన్యవాదాలు.

నా సినీ పరిశ్రమ మిత్రులకు, వారు అందించిన ప్రేమకు ధన్యవాదాలు.

అలాగే, దేశవ్యాప్తంగా ఉన్న మీడియాకు మా సినిమాను విశేషంగా ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు.

Also Read- RGV: సల్మాన్‌లో చావు భయం..



Tarak-Letter.jpg

మా నిర్మాతలు సుధాకర్ మిక్కిలినేనిగారు మరియు హరికృష్ణ కొసరాజుగారికి ఈ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా రూపొందించినందుకు ధన్యవాదాలు.

ప్రపంచ నలుమూలల ఇంతటి ఆదరణ చూపిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు నా ధన్యవాదాలు.

నా కుటుంబ సభ్యులైన నా అభిమానులందరికీ, గత నెల రోజులుగా దేవర చిత్రాన్ని ఒక పండుగలా జరుపుకుంటున్నందుకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు చూపించే ప్రేమ, అభిమానమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. మీరు ఎల్లప్పుడు గర్వపడే చిత్రాలు చేస్తూనే ఉండడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. ‘దేవర పార్ట్ 1’ చిత్రాన్ని మీ భుజాలపై మోసి, ఇంతటి ఘన విజయవంతంగా మార్చినందుకు కృతజ్ఞతలు..’’ అని తారక్ ఈ లేఖలో పేర్కొన్నారు.

Also Read- Shruthi Haasan: అడివి శేష్‌ ఇన్‌వాల్వ్‌మెంట్‌ కారణమా..

Also Read- Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' టీజర్.. ఎగిరే గుర్రంపై చిరు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 15 , 2024 | 04:04 PM