JR NTR: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. తారక్ ఏమన్నారంటే...
ABN , Publish Date - Sep 22 , 2024 | 11:14 PM
'దేవర’ (Devara) ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంపై హీరో ఎన్టీఆర్ (Jr NTR) స్పందించారు. ఈ విషయంలో అభిమానులకంటే తనకే ఎక్కువ బాధ ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
'దేవర’ (Devara) ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంపై హీరో ఎన్టీఆర్ (Jr NTR) స్పందించారు. ఈ విషయంలో అభిమానులకంటే తనకే ఎక్కువ బాధ ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. "సమయం కుదిరినప్పుడు అభిమానుల్ని కలవాలని ఎన్నో విషయాలు పంచుకోవాలనుకుంటాను. ముఖ్యంగా 'దేవర’ చిత్రం గురించి ఎన్నో విషయాలు షేర్ చేసుకోవాలనుకున్నా. కానీ భద్రతా కారణాల వల్ల ఈవెంట్ రద్దు అయింది. ఈ విషయంలో ఎవర్నీ బ్లేమ్ చేయలేము. ఇప్పుడు అభిమానుల్ని కలవలేకపోయాను. కానీ ఈ నెల 27న థియేటర్‌లో సినిమా చూసి ఈ ఆశీస్సులు అందించండి. నాకు, ఈ సినిమాకు అదెంతో అవసరం. అభిమానులు కాలర్ ఎగరేసేలా సినిమాలు చేయడంలో ఉన్న కిక్కు మరెందులోనూ లేదు. శివ కొరటాల ఎంతో కష్టపడి ఈ సినిమా తీశారు. దేవర చూసి ఆనందించండి’’ అని అన్నారు. (Devara Pre Release event Cancel)
తారక్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. యువసుధా ఆర్ట్, ఎన్‌టీఆర్‌ఆర్స్ట్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఆదివారం సాయంత్రం జరగాల్సిన ఈవెంట్ అభిమానులు బారీగా తరలిరావడంతో భద్రతా సమస్యలు తలెత్తాయి. కొందరు అభిమానులకు ఎంట్రీ పాస్‌లు దక్కలేదు. దాంతో ఆగ్రహించిన అభిమానులు ఒక్కసారిగా ఆడిటోరియమ్‌లోకి ప్రవేశించి ప్రయత్నం చేయగా అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం అయ్యాయి. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు కూడా అదుపు చేయలేకపోవడంతో ఈవెంట్‌ను రద్దు చేశారు.