Jr NTR: షూటింగ్‌తోపాటు కుటుంబంతో విహారానికి..

ABN , Publish Date - Jun 17 , 2024 | 02:56 PM

జూ.ఎన్టీఆర్‌ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. 'దేవర' సినిమా కీలక షెడ్యూల్‌ను గోవాలో పూర్తి చేసుకుని ఇటీవల జూ.ఎన్టీఆర్‌, చిత్ర బృందం  హైదరాబాద్‌ చేరుకున్నారు.

Jr NTR: షూటింగ్‌తోపాటు కుటుంబంతో విహారానికి..


జూ.ఎన్టీఆర్‌ (Jr NTR) క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. 'దేవర' (Devara) సినిమా కీలక షెడ్యూల్‌ను గోవాలో పూర్తి చేసుకుని ఇటీవల హైదరాబాద్‌ చేరుకున్నారు. సోమవారం తాజా షెడ్యూల్‌ కోసం థాయిలాండ్‌ (Ntr off to Thailand) పయనమయ్యారు. అక్కడ ఓ పాట, కీలక సన్నివేశాలు చిత్రీకరణ చేయనున్నారట. ఆయనతోపాటు భార్య  లక్ష్మీ ప్రణతి, పిల్లలు కూడా వెళ్లారు. ఆదివారం సాయంత్రం కథానాయిక జాన్వీకపూర్‌ కూడా థాయ్‌ల్యాండ్‌కు బయలుదేరారు. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్న ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు ఆ వీడియోలను షేర్‌ చేస్తున్నారు. అయితే షూటింగ్‌తోపాటు తన కుటుంబంతో సరదాగా గడపడానికి కూడా ట్రిప్‌ వేసినట్లు తెలుస్తోంది.

devarajrntrfour.jpg

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్‌ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. సరైన హిట్‌ కోసం కొరటాల శివ శాయశక్తులు ప్రయత్నాలు చేస్తున్నారు. పక్కా మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సుధాకర్‌ మిక్కిలినేని, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రుతీ మరాఠే, ప్రకాశరాజ్‌, మురళీశర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొదటి భాగాన్ని సెప్టెంబర్‌ 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

devarajrntrthree.jpg

Updated Date - Jun 17 , 2024 | 02:57 PM